చికిత్స పోందుతూ బాలిక మృతి

కారేపల్లి: ఈ రెండు రోజుల క్రితం విడుదల అయిన సప్లిమెంటరి పది ఫలితాలు విడుదల అయిన తర్వా పదో తరగతి ఫెయిల్ అయిందని మనస్ధాపంతో బాలిక పురుగుమందు త్రాగగా చికిత్స పోందుతూ బుధవారం మృతి చెందిన ఘటన సింగరేణి మండల పరిధిలోని మేకల తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం… భూక్యా రాజేశ్వర (16) మేకల తండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివింది. రాజేశ్వరి మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలు […]

కారేపల్లి: ఈ రెండు రోజుల క్రితం విడుదల అయిన సప్లిమెంటరి పది ఫలితాలు విడుదల అయిన తర్వా పదో తరగతి ఫెయిల్ అయిందని మనస్ధాపంతో బాలిక పురుగుమందు త్రాగగా చికిత్స పోందుతూ బుధవారం మృతి చెందిన ఘటన సింగరేణి మండల పరిధిలోని మేకల తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కధనం ప్రకారం… భూక్యా రాజేశ్వర (16) మేకల తండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదివింది. రాజేశ్వరి మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలు రాయగా అందులో గణితం ఫెయిల్ అయింది. అదే పరీక్షను సప్లిమెంటరీలో రాసినా రెండు రోజుల క్రితం వచ్చిన ఫలితాలలో మరోకసారి ఫెయిల్ అయింది. తన తోటి విద్యార్ధులు పై చదువులకు వెళ్ళుతుండటం, తను ఫెయిల్ కారణంగా ఇంటి వద్దనే ఉండటంవల్ల మధనపడుతున్న రాజేశ్వరిని తల్లిదండ్రులు ఓదార్చారు. అయిన బాలిక ఈ నెల 9వ తేదిన ఇంట్లో ఉన్న పురుగుల మందు త్రాగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హూటిహూటినా ఖమ్మం ఆసుపత్రికి తరలించి, చికిత్సను నిర్వహిస్తుండగా చికిత్స పోందుతూ రాజేశ్వరి మృతి చెందింది. దీనికి సంబంధించి బాలిక తండ్రి పిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ కేసును నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.