చికిత్స పొందుతూ మహిళ మృతి

Woman died after treatment
మేడ్చల్: ఆటో బోల్తా కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన శనివారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుర్తు తెలియని సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళ రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే ఆటోలో ప్రయాణిస్తుంది. రాంపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా కొట్టడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో ఆమెను చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంలో మృతి చెందిన మహిళపై కుడి చేతిపై వెంకటమ్మ, ఎడమ చేతిపై మల్లమ్మ పేర్లతో పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments