చికట్లో ప్రయాణం భయం..భయం…

biack-image

హెచ్చరిక బోడ్లు లేక మరో ప్రమాదం

అదుపుతప్పి బోల్తా పడిన ద్విచక్ర వాహనం
మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్‌ః తెలంగాణ ప్రభుత్వం అభివృద్దిలో భాగంగా డబుల్ రోడ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నిర్మల్ నుండి ఖానాపూర్ వరకు ఉన్న రోడ్డును వెడెల్పుగా మారుస్తున్నారు. అయితే నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లి వద్ద రోడ్డు మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయి. కానీ రోడ్డు ఇరువైపుల ఎలాంటి హెచ్చిరిక బోడ్లు లేకపోవడంతో రాత్రి వేళలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తాజాగా మంగళవారం ఖానాపూర్ నుండి నిర్మల్ వైపు వస్తున్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయి ద్విచక్రవాహనం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆయనకు స్వల్ప గాయాలు కాగా గమణించిన స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న ‘మన తెలంగాణ’ ఈ విషయాన్ని మరోసారీ ప్రపంచానికి తెలుపుతుంది. ఇకనైన రోడ్డు కాంట్రాక్ట్ అధికారులు మేల్కొని రోడ్డు ఇరువైపులా హెచ్చరిక బోడ్లు, రేడియంలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

comments