చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నాం…

Kcr-image

బోగులాంబ గద్వాల్: సిఎం కెసిఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నడిగడ్డ ప్రగతి సభకు హాజరైన ఆయన ప్రసంగించారు. గద్వాల్ లో 300 పడక గదుల దవాఖానను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గద్వాల్ అభివృద్ధికి 100 కోట్ల నిధులను మంజూరు చేస్తామని చెప్పారు. ఎస్సి, ఎస్టి, స్టీడీ సర్కిల్ ఏర్పాటు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నడిగడ్డు ఎత్తిపోతల పథకానికి, నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకంగా నామకరణాన్ని అధికారకంగా పేరు పెట్టామని తెలిపారు. తెలంగాణలో గురుకుల పాఠశాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 584 మండలాల్లో బిసి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కెటి దొడ్డికి ట్రైబల్ గురుకుల పాఠశాలను మంజూరు చేస్తున్నట్టు సిఎం తెలిపారు. నాలుగైదు నెలల్లో గుర్రం గడ్బ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర బృందావనం కోసం సిఎం ఫండ్ నుంచి రూ.15 కోట్టు మంజూరు చేస్తామన్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని గుర్తు చేశారు.

కోటి ఎకరాలకు నీళ్లందించడం టిఆర్ ఎస్ సర్కార్ కి ఓ యజ్ఞం  అన్నారు. హరీష్ రావు, లక్ష్మారెడ్డి ప్రాజెక్టుల దగ్గర నిద్రచేసి మరీ పనులను వేగవంతం చేస్తున్నారని సిఎం కొనియాడారు. తెలంగాణలో ఉన్న సమస్యలన్నిఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా చేశామన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. పాలమూరు బీడు భూములు చూసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎంతో భాధ పడేవారని సిఎం గుర్తుచేశారు. పాలమూరును తలుచుకుని ఎన్నో సార్లు కళ్లనీళ్లు పెట్టుకున్నామని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు కాంగ్రెస్ నేతలు కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేదాక విశ్రమించేది లేదని కెసిఆర్ తేల్చిచెప్పారు. భూరికార్డుల్లో సమూల మార్పులు చేశామన్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో రైతు పేరు తప్పా..  ఇతర పేర్లు ఉండవు అన్నారు. గతంలో పాస్ పుస్తకం కావాలంటే పైరవీలు చేయాల్సివచ్చేదని, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. పంట పెట్టుబడి కోసం బడ్డెట్ లో రూ.12వేల కోట్లు కేటాయించామని తెలిపారు. అప్పుల తీరి నాలుగైదు లక్షలు జేబులో ఉన్నప్పుడే రైతు బాగుపడతాడని కెసిఆర్ అన్నారు.

రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేశామని కెసిఆర్ తెలిపారు. మండలానికో గోడౌన్ లను నిర్మిస్తామన్నారు. రైతు సమస్యలను పరిష్కారించడానికే రైతు సయన్వయ సమితిలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. పంటకు గిట్టుబాటు ధరలు రావాలంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు పండిచాలని సిఎం రైతులకు హితబోద చేశారు. ఎటువంటి భూమిలో ఏ పంటలు పండిస్తే పంట బాగ పండుతుందనే విషయాలను వచ్చే ఏడాది నుంచి శాస్త్రవేత్తలు చేపుతారని కెసిఆర్ చెప్పారు. దేశం మొత్తం తెలంగాణకు వచ్చి నేర్చుకునేలా అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 31 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల బాగు కోసం అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చామన్నారు. గర్భిణీలకు కెసిఆర్ కిట్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్న ఘనత తమకే సొంతం అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రూ.42 వేల కోట్లు కేటాయించాంమని వెల్లడించారు. జోగులాంబ గద్వాలలో ఇంతా భారీ ఎత్తున సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్  తన ప్రసంగాన్ని ముగించారు.

Comments

comments