చర్లపల్లి ఒపెన్ జైల్లో ఖైదీ మృతి

Prisoner died of heart attack in a jail in Charlapally
హైదరాబాద్: చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రం (ఒపెన్ జైల్)లో గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఖైదీ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా దుబ్బక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పోచయ్య(58) హత్య కేసులో గత ఐదు సంవత్సరాలుగా చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. సత్‌ ప్రవర్తణతో ఉన్న పోచయ్యను గత మూడు నెలల క్రితం ఒపెన్ జైల్లో పని చేసేందుకు జైలు అధికారులు ఎంపిక చేశారు. అప్పటి నుంచి పోచయ్య ఒపెన్ జైల్లో పని చేస్తున్నాడు. బుదవారం రాత్రి భోజనం చేసి పడుకున్న పోచయ్య తెల్లవారుజామున 3 గంటల సమయంలో లేచి మంచినీరు తాగి పడుకునాన్నడని తోటి ఖైదీలు తెలిపారు. గురువారం ఉదయం 6 గంటలకు ఖైదీల లాఖప్ తెరిచిన పోచయ్య లేవలేదు తోటి ఖైదీలు లేపగా లేవకపోవడంతో వార్డర్‌కు సమాచారం అందించారు. వెంటనే పోచయ్యను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహన్ని బందువులకు అప్పగించారు.

Comments

comments