చర్మం తాజాగా ఉండాలంటే…

నగరంలో వాతావరణం కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగాలు చేసేవారు, బయటకు   వెళ్లేవారు చర్మానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య ప్రభావం     శరీరంలోని ప్రతిభాగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యలను ఇంట్లో దొరికే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు.   నా వయసు 38. మెడపై ముడుతలు కనిపిస్తున్నాయి. నల్లగా మారుతోంది. గొంతు, ముఖం రంగులో తేడా కనిపిస్తోంది. రెండూ ఒక రంగులో కనిపించాలంటే ఏం చేయాలో తెలియజేయండి..                  […]

నగరంలో వాతావరణం కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగాలు చేసేవారు, బయటకు   వెళ్లేవారు చర్మానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య ప్రభావం     శరీరంలోని ప్రతిభాగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యలను ఇంట్లో దొరికే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు.  

నా వయసు 38. మెడపై ముడుతలు కనిపిస్తున్నాయి. నల్లగా మారుతోంది. గొంతు, ముఖం రంగులో తేడా కనిపిస్తోంది. రెండూ ఒక రంగులో కనిపించాలంటే ఏం చేయాలో తెలియజేయండి..                  కవిత, జీడిమెట్ల
సమాధానం: చర్మానికి సరైన పోషణ లేకపోతే ముడతలు వస్తాయి. అందుకనే ముఖంతోపాటు మెడకు కూడా నరిష్‌మెంట్ ఇవ్వాలి. రాత్రి పడుకునేముందు ఏహెచ్‌ఏ క్రీమ్‌తో ముఖం మెడను మసాజ్ చేయండి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయడానికి ముందు విటమిన్ ఇ ఆయిల్ చుక్కలు కొన్ని , రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి మెడపై రాయండి. పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే క్లినికల్ ట్రీట్‌మెంట్ పద్ధతిలో లేజర్ సిట్టింగ్స్, కొలోజన్ మాస్క్ కూడా పెట్టుకోవచ్చు. పార్లర్‌లో ఎప్పుడు ఫేషియల్ చేయించినా బ్యూటీషియన్‌తో మెడపై మసాజ్ కూడా చేయించండి. బొప్పాయి గుజ్జును మెడపై రాస్తూ ఉంటే క్రమంగా నలుపుదనం తగ్గుతుంది.
నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాది ఫీల్డ్ వర్క్. దీంతో శరీరం మొత్తం పొల్యూషన్ వల్ల చాల రఫ్‌గా తయారవుతోంది. చర్మం తాజాగా ఉండాలంటే ఏం చేయాలి. నాకింకా పెళ్లికాలేదు. వయసు 25 ఏళ్లు.
– రాజు, దిల్‌సుఖ్‌నగర్
సమాధానం: రెండు రోజులకు ఒకసారి బాడీ స్క్రబ్ చేసుకోవాలి. అందుకోసం తవుడులో మీగడ, చిటికెడు పసుపు కలిపి మొత్తం శరీరంపై రాసుకోండి. తర్వాత చేతులతో నెమ్మదిగా తీసేసి శుభ్రం చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజూ స్నానానికి ముందు మొత్తం శరీరాన్ని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయండి. వీటితోపాటు రోజూ 10-, 12 గ్లాసుల మంచినీళ్లు తప్పకుండా తాగండి. ప్రొటీన్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోండి. ప్రతిరోజూ మెడిటేషన్ చేయడం మర్చిపోవద్దు.

Comments

comments