చరిత్ర సృష్టించిన జిమ్నాస్ట్ దీపా

deepa

న్యూఢిల్లీ: భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. టర్కీలో జరిగిన ప్రపంచ చాలెంజ్ కప్ జిమ్నాస్టిక్ పోటీల్లో దీపా స్వర్ణం పతకం గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫిజిక్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగం పోటీల్లో దీపా కర్మాకర్ పసిడి పతకం సొంతం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. గతంలో బ్రెజిల్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలను తృటిలో చేజార్చుకున్న దీపా ఈసారి మాత్రం స్వర్ణం గెలిచి అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచ చాలెంజ్ కప్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. గాయం కారణంగా రెండేళ్లుగా జిమ్నాస్టిక్ పోటీలకు దూరంగా ఉన్న దీపా ఇటీవలే మళ్లీ ఆడడం మొదలు పెట్టింది. ఇదే క్రమంలో ప్రపంచ స్థాయి పోటీలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించింది. కాగా, స్వర్ణం సాధించిన దీపాను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.