చరిత్రలో కెసిఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు

Rajanna Sirisilla : Minister KTR Good Comments on CM KCR

రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ సిఎం కెసిఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. చరిత్రలో ఎవరూ అమలు చేయని సంక్షేమ పథకాలను కెసిఆర్ అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. జిల్లా పరిధిలో సోమవారం ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రైతు బంధు పథకంతో రైతులను కెసిఆర్ ఆదుకుంటున్నారని చెప్పారు. రామరాజ్యంలో కూడా రైతులు భూమి శిస్తు కట్టారని, కానీ కెసిఆర్ పాలనలో రైతులకే డబ్బులు ఇస్తున్నారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల పిల్లల కోసం రాష్ట్రంలో గురుకుల పాఠశాలు, కళాశాలలు ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో మరిన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలో కెసిఆర్ పాలనను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని ఆయన చెప్పారు. కెసిఆర్ పాలన మోడీకి కనిపించిందని, అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కెసిఆర్ అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Minister KTR Good Comments on CM KCR

Comments

comments