చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ హీరో కూతురు?

Ram-Charan-and-Sara-Ali-Kha

హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్‌ సరసన హీరోయిన్ గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ని తీసుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ఓ వార్త హల్ చల్  చేస్తోంది.

అంతేగాక అన్నీ కుదిరితే ఈ చిత్రాన్ని బైలింగ్వల్(తెలుగు, హిందీ)గా తెరకెక్కించే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం. కాగా, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం రాంచరణ్‌, సుకుమార్ డైరెక్షన్ లో  ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కి జంటగా సమంత నటిస్తోంది. సంక్రాంతి పండుగా సందర్భంగా ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకులముందుకు రానుంది.

Sara Ali Khan will be acting with Ram Charan Tej in Mani Ratnam Movie?