చమురు మంట

నెల గరిష్టానికి చేరిన ధరలు న్యూఢిల్లీ : మళ్లీ చమురు ధరలు పెరుగున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ చమురు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం ముడి చమురు ధర లు నెల గరిష్టానికి చేరుకున్నాయి. అమెరికాలో ముడిచమురు నిల్వలు తగ్గడం, ఇరాన్, వెనిజుల దేశాల నుంచి ముడిచమురు సరఫరా తగ్గుముఖం పట్టనుందనే అంచనాతో చమురు ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 77.48 డాలర్లకు చేరుకుంది. […]

నెల గరిష్టానికి చేరిన ధరలు

న్యూఢిల్లీ : మళ్లీ చమురు ధరలు పెరుగున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ చమురు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గురువారం ముడి చమురు ధర లు నెల గరిష్టానికి చేరుకున్నాయి. అమెరికాలో ముడిచమురు నిల్వలు తగ్గడం, ఇరాన్, వెనిజుల దేశాల నుంచి ముడిచమురు సరఫరా తగ్గుముఖం పట్టనుందనే అంచనాతో చమురు ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 77.48 డాలర్లకు చేరుకుంది. గురువారం ఒక్కరోజే 2శాతం వరుకు పెరిగింది. బ్యారెల్ చమురు ధర ఆగస్ట్ 15 నుంచి ఇప్పటి వరుకు బ్యారెల్ చమురు ధర 9 శాతం పెరిగింది.

విమానయాన షేర్లకు చమురు సెగ : అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ప్రభావం దేశీ య విమానయాన రంగంపై పడింది. గురువారం రంగానికి చెందిన పలు కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండిగో షేరు రూ.970.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఓ దశ లో 5శాతం నష్టపోయి రూ.921 కు పతనమైంది. ఆఖరికి 2 శాతం నష్టపోయి రూ.944 వద్ద స్థిరపడింది. బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రూ.80.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5.50 శాతం నష్టపోయి రూ.77.00ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆఖరికి 4 శాతం నష్టపోయి రూ.78.25 వద్ద ముగిసింది. ఇప్పటికే భారీగా పతనమైన జెట్ ఎయిర్‌వేస్ రూ.289.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 3.50శాతం నష్టపోయి రూ.281.55ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఆఖరికి 2 శాతం నష్టపోయి రూ.286.80 వద్ద స్థిరపడింది.

Related Stories: