చనిపోయిన వ్యక్తులు చెట్టు రూపంలో సజీవం!

మాములుగా ఎవరైనా చనిపోయినవారిని స్మశానాలకు తీసుకెళ్లి  పూడ్చి పెట్టడం చూస్తుంటాం…  లేదా కొందరు వారి ఆచారాలను బట్టి దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఇటలీకి చెందిన అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్ అనే డిజైనర్లు… “మీరు ప్రేమించే వ్యక్తులను చెట్ల రూపంలో చూసుకోండి” అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఓ సరికొత్త ఆలోచనతో పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చారు. ఎక్కడైనా వ్యక్తి చనిపోయిన తర్వాత శవ పేటికలో పెట్టి భూమిలో పాతిపెడతారు. ఇందుకు స్మశానంలో స్థలం కూడా […]

మాములుగా ఎవరైనా చనిపోయినవారిని స్మశానాలకు తీసుకెళ్లి  పూడ్చి పెట్టడం చూస్తుంటాం…  లేదా కొందరు వారి ఆచారాలను బట్టి దహనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, ఇటలీకి చెందిన అన్నా టిటెల్లీ, రౌల్ బ్రెట్జెల్ అనే డిజైనర్లు… “మీరు ప్రేమించే వ్యక్తులను చెట్ల రూపంలో చూసుకోండి” అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఓ సరికొత్త ఆలోచనతో పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుకొచ్చారు. ఎక్కడైనా వ్యక్తి చనిపోయిన తర్వాత శవ పేటికలో పెట్టి భూమిలో పాతిపెడతారు. ఇందుకు స్మశానంలో స్థలం కూడా అవసరం. అయితే.. తక్కువ స్థలంలోనే భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టేందుకు అనువైన శవపేటికలను ఈ డిజైనర్లు  సిద్ధం చేశారు.

గుడ్డు ఆకారంలో ఉండే ఈ శవపేటిక (క్యాప్సూలా ముండి)లో పార్థివ శరీరాన్ని ఉంచి.. భూమిలో పాతిపెడతారు. అలా భూమిలో పాతిపెట్టిన క్యాప్సుల్ పై మీరు కోరిన చెట్టు విత్తనం లేదా మొక్కను ఉంచుతారు. అది క్రమేణా క్యాప్సుల్‌ను అంటిపెట్టుకుని పెరుగుతుంది. వాటి వేర్లు క్యాప్సుల్‌లోకి చేరి.. మానవ శరీరంలో పోషకాలను గ్రహిస్తూ ఎదుగుతుంది. అంటే, వ్యక్తి శరీరంలోని ప్రతి అణువు.. చెట్టులోకి చేరుతుందన్నమాట. ఈ విధానాన్ని వీరు 2015లోనే మొదలుపెట్టారు. ఇప్పుడు క్రమంగా ఈ క్యాప్సుల్ ఐడియాకు ఆదరణ పెరుగుతోంది.

వీరి ఆవిష్కరణకు ఇటలీతోపాటు అమెరికా, బ్రిటన్ దేశాల్లో  మంచి డిమాండు నెలకొంది. దీనివల్ల స్మశానాలు కాంక్రీటు దిమ్మెలతో నిండిపోకుండా పచ్చదనం నెలకొంటుందని డిజైనర్లు చెబుతున్నారు. అస్థికలను సైతం ఈ విధానంలో చెట్లుగా మార్చవచ్చని తెలుపుతున్నారు. ఈ విధానం మన దేశంలో కూడా అమలైతే.. స్మశా నాలన్నీ పచ్చదనంతో నిండిపోతాయి కదూ. అటవి శాతం కూడా పెరిగి పర్యావరాణాన్ని పచ్చదనంతో ఉంచేలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలు రోజుకొకటి పుట్టుకొస్తుంటాయి.