చదువును మించిన సంపద లేదు

There is no wealth beyond study

రాష్ట్రంలో 87 కెజిబివిలు జూనియర్ కళాశాలలుగా ఏర్పాటు
560 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
జూనియర్ కళాశాలను ప్రారంభించిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/వనపర్తి : చదువు అన్ని సంపదలకు మించిన సం పద అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం ఆయన వనపర్తి మర్రికుంటలోని బాలికల కెజిబివి పాఠశాల ఇంటర్మీడియట్ స్థాయి పెంపు సందర్భంగా ఇంటర్ తరగతులను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ జ్ఞానార్జనకు చదువే సాధనమని, ప్రతి విషయం చదువుతోనే ముడిపడి ఉందని అందువల్ల విద్యార్థినులు ఏకాగ్రతతో మనస్సు మీద లగ్నం చేసి చదవాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచించారు. విద్యతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించాలని, సమాజంలో లింగ వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 56 జిఒ ద్వారా రాష్ట్రంలోని 87 కెజిబివి పాఠశాలల స్థాయిని జూనియర్ కళాశాలల స్థాయికి పెంచిందన్నారు. అలాగే 560 పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థునులకు జనరల్ నాలేడ్జిపై ప్రశ్నలు వేసి సరైన సమాదానం చెప్పిన వారందరికి రూ.1000 అందజేశారు. కలెక్టర్ శ్వేతామహంతి మాట్లాడుతూ కెజిబివి విద్యార్థినులు విద్యతోపాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, రక్తహీనతకు గురి కాకుండా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కెజిబివి పాఠశాలలను కళాశాలల స్థాయికి పెంచడం ఈ ప్రాంత విద్యార్థినులకు వరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సౌకర్యాలను వినియోగించుకోవాలని అన్ని విషయాలపై దృష్టి సారించాలని ముఖ్యంగా లెక్కల పట్ల భయం విడిచిపెట్టాలన్నారు. కెజి బివిలు సమర్థతకు నిలిచి విద్యార్థునులకు సమగ్ర విద్యతో పాటు పరిపూర్ణమైన స్త్రీలుగా తీర్చిదిద్దేవిగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డిఈఒ సుశీందర్‌రావు, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ ఎత్తం రవి, ఎంపిపి శంకర్‌నాయక్, డిపిఆర్‌ఒ వెంకటేశ్వర్లు, కెజిబివి ప్రిన్సిపల్ లోహిత, లక్ష్మయ్య, సెక్టోరియల్ అధికారి గణేష్, కౌన్సిలర్లు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, కెజిబివి సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Comments

comments