చక్రవ్యూహంలో అన్నదాత

అందని బ్యాంకు రుణాలు కొత్త నిబంధనలతో చిక్కులు వెంటాడుతున్న నకిలీ విత్తనాలు మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : ఆరుగాలం శ్రమించి ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత ప్రస్తుతం కష్టాల కడలిలో ఏటికి ఎదురీదుతున్నాడు. రుతుపవనాల ప్రకారం కురవాల్సిన వర్షాలు అకాల వర్షాల రూపంలో ఇక్కట్లకు గురి చేస్తుండగా ఇంకా తగ్గని వేడి ఉష్ణోగ్రత ఖరీఫ్ సాగును అతలాకుతలం చేస్తుంది. అయితే రైతులు ప్రస్తుతం సాగు పనులు మొదలు పెట్టినప్పటికీ వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. […]

అందని బ్యాంకు రుణాలు
కొత్త నిబంధనలతో చిక్కులు
వెంటాడుతున్న నకిలీ విత్తనాలు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో : ఆరుగాలం శ్రమించి ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత ప్రస్తుతం కష్టాల కడలిలో ఏటికి ఎదురీదుతున్నాడు. రుతుపవనాల ప్రకారం కురవాల్సిన వర్షాలు అకాల వర్షాల రూపంలో ఇక్కట్లకు గురి చేస్తుండగా ఇంకా తగ్గని వేడి ఉష్ణోగ్రత ఖరీఫ్ సాగును అతలాకుతలం చేస్తుంది. అయితే రైతులు ప్రస్తుతం సాగు పనులు మొదలు పెట్టినప్పటికీ వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఖరీఫ్ పంట రుణాలను అందించాల్సిన బ్యాంకులు ఆ దిశగా స్పందించక పోతుండడం రైతుకు శాపంగా మారింది. సీజన్ మొదలు కాక ముందే వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేయాల్సిన బ్యాంకులు ఇప్పటి వరకు ఆ దిశగా కార్యాచరణను మొదలు పెట్టక పోవడం ఆర్థిక పరంగా అన్నదాతను ఆందోళనకు గురి చేస్తుంది. రైతులు బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వడ్డీ వ్యాపారులు ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తుండడం గమనార్హం. కాగా ఆలస్యంగా గురువారం ఖరీఫ్ వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. రైతులు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలాఉండగా ఈసారి మళ్లీ నకిలీ విత్తనాల వ్యవహారం అన్నదాతను అవస్థలు పాలు చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం సరఫరా చేసిన సోయా విత్తనాలు మొలకెత్తక పోతుండడం అన్నదాతను అయోమయానికి గురి చేస్తుంది. నర్సాపూర్(జి), బేల తదితర మండలాలలో సోయా విత్తనాలు కొద్ది రోజుల్లోనే ఎండిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనలకు దిగుతూ న్యాయం చేయాలని కోరుతున్నారు.అయితే ప్రభుత్వపరంగా మాత్రం ఈ నకిలీ విత్తనాల విషయంలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదని అంటున్నారు. మొదటి నుంచి రైతులకు బ్యాంకుల సహాయ నిరాకరణ కొనసాగుతుండడం శాపంగా మారింది. గతంలోని రుణమాఫీ వ్యవహారాల కారణంగా బ్యాంకులు ఈ ఖరీఫ్‌లో పంట రుణాలను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. అలాగే వార్షిక రుణ ప్రణాళిక ఖరారు కాలేదన్న సాకుతో బ్యాంకులు వ్యవసాయ రుణాలిచ్చేందుకు చేతులెత్తేశాయి. సీజన్ మొదలైన తరువాత అందించే రుణాల వల్ల రైతులకు ఆశించిన మేరకు ప్రయోజనం చేకూరే అవకాశం లేదని అంటున్నారు. మరికొద్ది రోజులలో రైతులకు ఎరువుల అవసరాలు కూడా ఏర్పడుతుంది. అయితే దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు మొదలు కాలేదు. ఇలా అన్నదాత అష్టదిగ్భందంలో చిక్కుకొని విలవిలలాడుతున్నప్పటికీ ఆదుకొనే నాథుడే కరువయ్యారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశగా దృష్టిసారించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టనట్లయితే పత్తి, వరి తదితర పంటల విషయంలో కూడా రైతుకు తిప్పలు తప్పవని అంటున్నారు.

Comments

comments

Related Stories: