వనపర్తి : జిల్లాలోని కొత్తకోట మండలంలోని అప్పరాల గ్రామ సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పరిశ్రమ మూడు నెలలుగా మూతపడి ఉంది. షాక్ సర్కూట్ కారణంగా మంటలు చెలరేగటంలో ప్రమాదం జరిగిందని కర్మాగారం యాజమాన్యం తెలిపింది. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని చెరకు పిప్పి, కర్మాగారానికి బొగ్గును సరఫరా చేసే మిషన్ బెల్టులు, పవర్ప్లాంట్, పూర్తిగా దగ్ధమయ్యాయని, సుమారు రూ.2కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వనపర్తి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
comments