చందానగర్ లో సందడి చేసిన రాశీఖన్నా…

Rashi Khanna Launches oppo F 9 At chandanagar Big C
రంగారెడ్డి: చందానగర్ డివిజన్ పరిధిలో బుధవారం ‘బిగ్ సి’- షోరూంలో బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్, సినీహిరోయిన్ రాశీఖన్నా సందడి చేశారు. బిగ్‌ సి ఫౌండర్, సిఎండి బాలు చౌదరి, ఒప్పో సంస్థ స్టేట్ హెడ్, యాంగల్ సేల్స్ హెడ్ ప్రతినిధులు పిటర్‌లతో సినీహిరోయిన్ రాశీఖన్నా ఒప్పో ఎఫ్ 9 ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్బంగా సినీహిరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ.. బిగ్ సి ఆధ్వర్యంలో ఒప్పో ఫోన్ 9ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్‌లను తీసుకువచ్చి ఒప్పో సంస్థ, మరోక స్మార్ట్ మొబైల్ ఫోన్ తీసుకురావడం అభినందనీయమన్నారు. అనంతరం బాలు చౌదరి మాట్లాడుతూ ఒప్పో ఎఫ్ 9 కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 2 గంటలు మాట్లాడుకోవచ్చన్నారు. ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపేవారికి, ఛార్జింగ్ సమస్యలు ఎదుర్కొనే వారికి ఈ ఫోన్ ఎంతో అనువైందన్నారు.

Comments

comments