నల్గొండ: సినీ హీరో, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడ్డారు. హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను స్థానికులు హుటాహుటిన చికిత్స కోసం నార్కెట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎపిలోని నెల్లూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా అన్నేపర్తి దగ్గర ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో రోడ్డుప్రమాదంలో హరికృష్ణ కుమారుడు చనిపోయిన సంగతి తెలిసిందే.
Comments
comments