ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

Car-Accident

నల్లగొండ:  కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టిన ఘటన నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు మోహిన్, అక్బర్, ముస్తఫా, సద్దాం, తమ్ము(5)గా గుర్తించారు. హైదరాబాద్ లోని టోలీ చౌకీ చెందిన ఐదు కుటుంబాలు వేర్వేరు వాహనాల్లో నాగార్జున సాగర్ కు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Comments

comments