ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

అమరావతి: ఎపిలోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక వస్తున్న ట్రాక్టర్ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల గ్రామంలో […]

అమరావతి: ఎపిలోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక వస్తున్న ట్రాక్టర్ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Related Stories: