ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి…

సూర్యాపేట: వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు వద్ద నేషనల్ హైవేపై శనివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కాగా, ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు […]

సూర్యాపేట: వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంజలూరు వద్ద నేషనల్ హైవేపై శనివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. కాగా, ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులను వరంగల్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments