ఘోర ప్రమాదం.. 20 గొర్రెలు మృతి…

నాగర్‌కర్నూల్: రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం కొట్టాలగడ్డ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా, మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు చెప్పాడు. ఘటనపై కేసు నమోదు […]

నాగర్‌కర్నూల్: రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో 20 గొర్రెలు మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలం కొట్టాలగడ్డ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి గొర్రెలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 20 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా, మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదం వల్ల సుమారు రూ. 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు చెప్పాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Stories: