లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి…

Four Dead in Car Collision with Lorry in Peddapalli district

పెద్దపల్లి: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతిచెందిన ఘోర ప్రమాద ఘటన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి  రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను మంథనికి చెందిన చదువాల అరుణ్ కుమార్ (37) సౌమ్య (30) అకిలేష్ (10) శాన్వి (8)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.