ఘనంగా ‘దమ్మక్క’ సేవాయాత్ర

 Tribal people Special prayers

మన తెలంగాణ/భద్రాచలం : శ్రీ సీతారామ ఆలయంలో గురువారం దమ్మక్క సేవా యాత్ర వైభవోపేతంగా సాగింది. పూర్తి గిరిజన సంప్రదాయాను సారంగా సాగిన ఈ తంతు ఆధ్యాంతం ఆకట్టుకుంది. భద్రాద్రి రాముని అనుగ్రహప్రాప్తురాలైన అభివన భక్తశబరి దమ్మక్క భగవత మూర్తులను కల్లెదుట దర్శించిన మహానీయురాలు. అలాంటి పుణ్యమూర్తిని స్మరించుకునేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో దమ్మక్క సేవా యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే 6.30 గం. నుంచి 7.30 గం. వరకు స్వామి దర్శన భాగ్యం కల్పించారు. చిత్రకూట మండపం ఎదుట ముందుగా దమ్మక్క చిత్రపటానికి ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ శ్వేత, ఆలయం ఇఓ కృష్ణవేణి అర్చకులు పూజలు నిర్వహించి పుష్పాభిషేకం చేశారు. అనంతరం దమ్మక్క ఫొటోతో గిరి ప్రదిక్షణ ప్రారంభమైంది. ఆలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన సబ్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఉన్న పోకల దమ్మక్క విగ్రహం వద్దకు మేళతాళాల చేరుకుంది.

అనంతరం దమ్మక్కకు ప్రత్యేక పూజలు చేసి తాటిపండ్లు, ఇతర ఫలాలు, పుష్పాలు నైవేద్యంగా సర్పించారు. అక్కడ నుంచి పుర వీధులుగుండా ప్రదర్శన రామాలయానికి చేరుకుంది. సిద్ధం చేసిన పండ్లు, పూలులతో శ్రీ సీతారామచంద్రస్వామికి సైతం ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు సాగాయి. రామాలయంలో మెట్లపై గిరిజన మహిళలు ఇరువైపులా ఉండి ఓక్కోక్కరి చేత్తో ఓక్కో రకమైన పూలు, పండ్లు పట్టుకుని బారులు తీరిన తీరు భక్తిభావం ఉట్టిపడేలా చేసింది. అనంతరం చిత్రకూట మండపంలో ఉత్సవ మూర్తులకు నిత్య కళ్యాణం జరిపించారు. దమ్మక్క సేవా యాత్ర సందర్భంగా చిత్రకూట మండపాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు, పట్ట ప్రజలతో మండపం నిండిపోయింది. స్వామి కల్యాణం తంతు సాగుతన్నంత సేవు భక్తులు రామనామస్మరణ చేశారు. ఐటిడిఏ పిఓ పమేలా సత్పథి రామాలయంలో జరుగుతున్న దమ్మక్క సేవా యాత్రకు విచ్చేసి నిత్యకళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
గిరిజనులకు కానుకలు :- ఇతర ప్రాంతాల నుండి బస్సుల ద్వారా తీసుకొచ్చిన గిరిజనులకు రామాలయం తరుపున వస్త్రాలతో పాటు,పూలుపండ్లు, రాముని చిత్రపటం తదితరాలు సమర్పించారు. అదే విధంగు పరుషులకు రాముల వారి కండువాను మెడలో వేసి ప్రసాదాలు అందజేశారు. రామాలయం ప్రాంగణంలో దూరప్రాంతాల నుండి వచ్చిన వారికి పులిహోరా,ప్రసాదాలు సిద్దం చేసి అందజేశారు.
ఆకట్టుకున్న నృత్యాలు :- పూర్తి గిరిజన సాంప్రదాయా ను సాగిన ఈ తంతులో కొమ్మునృత్యాలు, డప్పు వాయిధ్యాలు ఎంతగానో ఆ కట్టుకున్నాయి. ప్రత్యేక కొమ్ము లు, డప్పులు గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు చేస్తుండగా సాగిన ప్రదక్షిణ అందర్నీ ఆకట్టుకుంది. రామాలయ ప్రాంగణంలో నిత్య కళ్యాణం జరిగిన అనంతరం కూడా గిరిజన నృత్యాలను ప్రదర్శించారు. సుమారు 50 మంది గల బృంధం ప్రత్యేక వేషధారణతో పెద్దపెద్ద డోళ్లు మేడకు తగిలించుకుని నెత్తిన కొమ్ముల తలపాగాపెట్టుకుని చేసిన నృత్య భంగిమలు అలరించాయి.
తిరుకళ్యాణం : తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజు స్వామివారి తిరుకళ్యాణం నిర్వహించారు. గిరిజన నాట్యాలతో ఊరేగింపుగా తాతగుడి సెంటర్‌కు స్వామి కళ్యాణ తలంబ్రాలను తోడుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఇఓ శ్రావణ్ కుమార్‌తో పాటు సిబ్బంది అనీల్, భవాని, భక్తరామదాసు పదో తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్, గిరిజన పెద్దలు ముర్ల రమేష్, పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments