ఘనంగా స్వామి వివేకానంద 154 వ జయంతి వేడుకలు

ఇటిక్యాల: మండలంలోని చాగా పురం గ్రామంలో స్వామి వివేకానంద 154వ జయంతిని స్వామి వివేకానంద యుత్ ఆధ్వ ర్యం లో ఘ నం గా జరుపు కున్నారు. కార్య్ర కమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎం పీపి నాగన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ స్వా మి వివేకానందను ఆద ర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అన్నారు.ప్రపంచానికి స్పూర్తి నిచ్చిన ఆధ్యాత్మికవేత్త అని,హిందుత్వం గురిం చి ప్రపంచానికి చాటిచెప్పిన ముఖ్యవ్యక్తి స్వామి […]

ఇటిక్యాల: మండలంలోని చాగా పురం గ్రామంలో స్వామి వివేకానంద 154వ జయంతిని స్వామి వివేకానంద యుత్ ఆధ్వ ర్యం లో ఘ నం గా జరుపు కున్నారు. కార్య్ర కమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎం పీపి నాగన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తూ స్వా మి వివేకానందను ఆద ర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని అన్నారు.ప్రపంచానికి స్పూర్తి నిచ్చిన ఆధ్యాత్మికవేత్త అని,హిందుత్వం గురిం చి ప్రపంచానికి చాటిచెప్పిన ముఖ్యవ్యక్తి స్వామి వివేకానంద అని అ న్నారు.కార్యక్రమంలో గ్రామసర్ప ంచ్,ఎంపిటీసి,స్వామి వివేకానంద యుత్ అధ్యక్షుడు పుష్య వంత్,వెం కట్రాములు,క్రిష్ణయ్య,గ్రామస్థులు పా ల్గొన్నారు. యువతకు ఆదర్శం వివేకానందస్వామి

పెబ్బేరుఃయువత ఆదర్శంగా ఉన్నట్లైతే దేశం అభివృద్ది చెందుతుందని ఆ దిశలో స్వామి వివేకానంద ఆదర్శంగా నిలిచారని బిజెపి మండలాధ్యక్షులు సంబు జయప్రకాష్‌శెట్టి అన్నారు. స్వామి వివేకానంద 154 జయంతి ఉత్సవాలను పెబ్బేరు మండలంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళు లర్పి ంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ హందూ మతం సాంప్ర దాయాలను ప్రపంచంలోనే చాటి చెప్పిన మహానీయుడని ఆయన కొని యాడారు. యువకులు దేశానికి పట్టుకొమ్మలుగా ఉండాలని, నిరుత్సాహం, నిస్ప్రుహ, ఉన్నట్లైతే ఆ వ్యక్తులు ఎందుకు కొరగారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా నాయకులు సహదేవుడు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గౌని వేమారెడ్డి, మోహన్‌కుమార్, దుర్గాప్రసాద్,నర్సింహ్మనాయుడు, క్రాంతి కుమార్ ఎబివిపి నాయకులు, శివ కార్తీక్, అరవింద్ , రాము,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

సూగూర్‌లో …
మండల పరిధిలోని సూగూర్ గ్రామంలో స్వామి వివేకానంద ఉత్సవాలను గ్రామ సర్పంచ్ కాటమోని రాజశేఖర్‌గౌడ్ ఘనంగా నిర్వహించారు. మండ లంలోనే వివేకానంద విగ్రహాన్ని నెలకొల్పి యువతకు మార్గ దర్శకంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బుచ్చన్న యా దవ్, పాత్రికేయులురవీందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
వివేకానంద చరిత్రను పుస్తకం బహూకరణ

నవాబ్‌పేట: ప్రస్తుత సమాజంలో పాశ్చత్య ధోరణిలో యువత దూసుకెళ్తున్న తరుణంలో వివేకానందుడి బోధనలకు ప్రభా వితమై న చిన్నారులు తల్లిదండ్రులు ఇచ్చిన చిల్లర డబ్బును దాచుకొని వివేకాన ందుని చరిత్ర పుస్తకాలను కొని గురువారం వివేకానంద జన్మదినం పురస్కరి ంచుకొని లైబ్రరీకి బహూరించిన సంఘటన పలువురిని ఆలోచించేలా చేసి ంది. మండల కేంద్రానికి చెందిన సాయి నిఖిల్ అనే 10వ తరగతి చదు వుతున్న బాలుడు తమ్ముడితోపాటు లైబ్రరీకి వచ్చి చరిత్ర పుస్తకాన్ని అసి స్టెంట్ లైబ్రేరియన్ రమేష్‌కు బహూకరించడం చూస్తే వివేకానందుడి భోదన లు రాబోవు తరాల లక్ష సాధనలో ఖచ్చితంగా దిశానిర్దేశం చేయ బోతు న్నాయన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఘనంగా వివేకానందుని జయంతి

నవాబ్‌పేట: మండల కేంద్రంలో గురువారం వివిధ రాజ కీయ పార్టీలు,యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానందుని జయం తిని ఘనంగా నిర్వహించారు. స్థానిక టిఆర్‌ఎస్ కార్యాయలంలో నాయ కుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో వివేకానందుడి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయ కులు వెంకటయ్య, హన్మంతు, సత్యం, నర్సింహ్ములు, ఎబివిపి నాయకులు శ్రీరాంనరేష్, మెండె శ్రీధర్, రాజు, ప్రవీణ్, బిజెపి నాయకులు కొల్లి నర్సిం హ్ములు, శ్రీనివాసులు, రఘు, సత్యం తదితరులు పాల్గొన్నారు.

యువత సమాజ సేవలో ముందుండాలి
-ఎంపిపి శ్రీనయ్య

నవాబ్‌పేట: సమాజ సేవలో యువత ముందుండాలని ఎంపిపి శ్రీనయ్య కోరారు. గురువారం మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో వివేకానంద జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య క్రమంలో ఆయన మాట్లాడుతూ యువత పాశ్చాత్య ధోరణిని వీడి వివేకా నందుడి మార్గాన్ని అనుసరించి స్వార్థ పూరిత ఆలోచనలు పక్కన పెట్టి ఆత్మ విశ్వాసంతో లక్షం వైపు ముందుకెళ్తూ సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషించాని, దేశ అభివృద్ధిలోయువత పాత్రే కీలకమని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో యువకులు ఉన్నత ఆదర్శ లక్షాలతో వివేకానందుని ఆదర్శ భావాలను రాబోయే తరాలకు తెలుపుతూ వాటిని పాటిస్తూ సమాజ సేవలో ఎల్లప్పుడు ముందుండాలని ఆయన కోరారు. రక్తదానం విజ యవ ంతం…జయంతి సందర్భంగా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి శ్రీనయ్య, తహసీల్దార్ చెన్నకిష్టన్న, జడ్పిటిసి ఇందిరాదేవి, మాజీ ఎంపిపి మాడెమోని నర్సింహులు, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, నాయకులు దామో దరాచారి, కృష్ణయ్య, రామచంద్రయ్య, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి యువతే కీలకం

బిజెపి మండలాధ్యక్షులు మున్నూరు రమేష్

అడ్డాకుల: దేశానికి యువతే కీలమని ఆనాడు స్వామి వివేకా నంద చెప్పిన మాటలను బిజెపి మండలాధ్యక్షులు మున్నూరు రమేష్ పేర్కొన్నారు. గురువారం స్వామి వివేకానంద 154వ జయంతిని పురస్కరి ంచుకొని మండల కేంద్రమైన అడ్డాకులలో నెలకొల్పిన వివేకానంద విగ్రహాని కి బిజెపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వివేకానందున్ని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. యువత అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా దేశ బాగోగుల కోసం కృషి చేయాలని ఆయన అన్నారు.

కందూరులో…

మండల పరిధిలోని కందూరు గ్రామంలో గ్రామస్థులు జడ్పీ ఉన్నత పాఠ శాల ఆవరణలో స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలతో ఘనం గా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు గట్టు మల్లేష్, ప్రతాప్‌రెడ్డి, చెన్నగౌడ్, ప్రవీణ్, అరుణ్, సత్యనారాయణ, శివ యాదవ్, అంజి, మనోహర్, రాజమల్లారెడ్డి, శ్రీకాంత్, రవీందర్‌శర్మ, నారా యణరెడ్డి, బివి.రాజు, శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మండల స్థాయి కబడ్డీ విజేత కందూరు

అడ్డాకుల: స్వామి వివేకానంద జయంతిని పురస్కరి ంచు కొని మండల పరిధిలోని కందూరు గ్రామంలో గురువారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రథమ విజేతగా కందరూరు నిలవగా, ద్వీతీయ విజెతగా శాఖాపూర్ గ్రామం కైవసం చేసు కుంది. అలాగే ముగ్గుల పోటీలు నిర్వహించగా ప్రథమ మమత, ద్వీతీయ వరలక్ష్మీ, తృతీయ అఖిల లు బహుమతులు అందుకున్నారు. ఈ సంద ర్భంగా గెలుపొందిన వారికి మండల పార్టీ అధ్యక్షులు మున్నూరు రమేష్ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడ్డాకుల సింగిల్ విండో ఉపాధ్యక్షులు శ్రీకాంత్, నాయకులు రాజమల్లారెడ్డి, గట్టు మల్లేష్, రవీంద ర్‌శర్మ, బివీ. రాజు,శ్యాంసుందర్‌రెడ్డి, నారాయణరెడ్డి పాల్గొ న్నారు.

మహబూబ్‌నగర్‌లో

మహబూబ్‌నగర్‌ః మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పలు చోట్ల స్వామి వివేకానంద స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరి గాయి.పట్టణంలోని రాజకీయపార్టీలు,ప్రజాసంఘాలు,యువజన సం ఘాల ఆద్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వివేకానంద విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పిం చారు.ఈ సంద ర్భంగా వివేకానంద స్వామి ఆశయాసాధనకు కృషి చేయా లని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి
మాజీ ఎంపిపి మన్నెపురెడ్డి

పెద్దమందడిః నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భారతదేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలకు చాటిన స్వామి వివేకానందుడుని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దమందడి మాజీ ఎంపిపి మన్నెపురెడ్డి అన్నారు. వివేకానందుని 154 వ జయంతి సందర్బంగా గ్రామంలోని వివేకానందుని విగ్రహానికి పూలమాల వేశారు. సర్పంచ్ సు గుణమ్మ , గ్రామ వివేకానంద యువజన సంఘం సభ్యులతో కలిసి ఆయన బైకు ర్యాలీలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

మద్దిగట్లలో…

మద్దిగట్ల గ్రామంలో గురువారం స్వామి వివేకానంద 154వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.ఎంపిటిసి సత్యారెడ్డి, సర్పంచ్ చెన్నకేశవులు, యువజన సంఘం సభ్యులు నరేందర్, బుద్వేష్,శ్రీనివాస్‌గౌడ్,మొగులయ్య, గోవర్దన్, పరమేష్, బాలకృష్ణగౌడ్, లక్ష్మన్ ,రాములు, నవీన్, మోహన్, నర్సింహులు,గాంధీ,విగ్రహానికి , వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేశారు.

వెల్టూర్‌లో

వెల్టూర్ గ్రామంలోని వివేకానందుని విగ్రహం దగ్గర గ్రామ యువకులు , సర్పంచ్ బాల్‌చంద్రయ్య ఆధ్వర్యంలో వివేకానందుని జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు రమేష్ మాట్లాడుతూ నేటి యువత నాటి వివేకానందుడుని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరు కోవాలని ఆయన సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆయన ఆదర్శంగా నిలిచాడని పేర్కొన్నారు.యువత మంచి మార్గంలో నడ వాలని వివేకానంద స్వామి అనేక సూత్రాలు చెప్పాడని చెప్పారు.ఆయ నసూచించిన మార్గంలో అందరూ పయనించాలని వారు కో రారు. ఆయనే అందరికి స్పూర్తి అని కొనియాడారు.

Comments

comments

Related Stories: