ఘనంగా మైఖల్ జాక్సన్ జన్మదిన వేడుకలు

Michael-Jackson1

లండన్: ప్రముఖ సంగీత కళాకారుడు, పాప్ కి రారాజు మైఖల్ జోషఫ్ జాక్సన్ 60వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. 1958 ఆగష్టు 29న అమెరికాలో జన్మించాడు. లాస్ ఎంజల్స్ లో 2009 జూన్ 25న మైఖల్ తుదిశ్వాస విడిచారు. జాక్సన్ పాడిన త్రిల్లర్ అనే అల్బమ్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయింది. జాక్సన్ కుటుంబం చాలా పెద్దది. జాక్సన్ కు ముగ్గురు సోదరీలు, నలుగురు సోదరులు ఉన్నారు. తన జీవిత కాలంలో 13 గ్రామీ అవార్డులు గెలుచుకున్నాడు. అమెరికాలో శ్వేత జాతీయుల మద్దతు పొందని తొలి వ్యక్తి జాక్సన్ కావడం విశేషం. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు.

Comments

comments