ఘనంగా గురుపౌర్ణమి

జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో మహిళల పూజలు

31kosgi1కల్వకుర్తి: పట్టణంలోని కుర్మిద్ద రోడ్డులో గల షిరిడిసాయి దేవాలయంలో శుక్రవా రం గురుపౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 5 గంటలకు కాగడహారతితో మొదలుకొని క్షీరాభిషేకాలు,ప ల్లకిసేవ, శేషహారతి,అన్నప్రసాద వితరణ,సంధ్యాహారతితో పాటు స్వర్ణభారతి కళాని లయం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.గురుపౌర్ణమిని పురస్క రించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని షిరిడిసాయిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి పాల్గొని షిరిడిసాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతు పట్టణంలో సాయిబాబ దేవాలయంలో దేవాలయ కమిటి చేపడుతున్న ఇంత పెద్ద కార్యక్రమాల్లో పాల్గొనటం నా అదృష్టమని ఆయన అన్నారు.పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు పూజా అనంతరం అన్నదాన కార్యక్ర మంలో పాల్గొన్నారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా షిరిడి సాయి దేవాలయ కమిటి ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించింది.

Comments

comments