గ్రామ స్వరాజ్ యోజనతో మౌలిక సదుపాయాల కల్పన

Infrastructure with village Swaraj Yojana

మన తెలంగాణ/సిర్పూర్(యు): గ్రామ స్వరాజ్ యోజనతో గ్రామాల్లో  మౌలిక సదుపాయాల కల్పన జరగనుందని కేంద్ర ప్రభుత్వ ఉప సంచాలకులు కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం సిర్పూర్(యు) మహాగావ్ గ్రామాల్లో ఆయన పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. గ్రామ స్వరాజ్ పథకం ద్వారా సిర్పూర్(యు) గ్రామపంచాయతీతోపాటు మహగావ్, కొత్తపల్లి గ్రామాలు ఎంపికయ్యాయన్నారు. ఈ పథకం ద్వారా ఏడు సంక్షేమ పథకాలు అమలు కానున్నాయన్నారు. ఉచిత గ్యాస్‌తోపాటు  జన్‌ధన్ బీమా యోజన, ఎంపికైన గ్రామాల్లో గృహావసరాలకోసం రెండేసి ఎల్‌ఇడి బల్బులు, రూ.125 లకే  విద్యుత్ మీటర్లు అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా సామాజిక, ఆర్థిక ప్రగతికి చర్యలు తీసుకోవడం జరుగుతందన్నారు. ఆరోగ్య పథకాల్లో భాగంగా ఇంద్ర ధనస్సు ద్వారా పిల్లలందరికి టీకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంగా వివిధ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి గంగాధర్ గౌడ్, ఇఒపిఆర్‌డి కొపడ ఆనంద్‌రావు, గ్రామ సర్పంచ్ ఆత్రంఓంప్రకాష్, డాక్టర్  హర్షిణీప్రియి, ఇస్తారి మహరాజ్, ఆయా ్రగ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Comments

comments