గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తాం

Let's make the green hairstyle successful

తెలంగాణను.. హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతాం..
రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటి లక్షాన్ని చేరుకోవాలి
నూతన గ్రామ పంచాయతీలకు మౌళిక వసతులను కల్పిస్తాం
హరిత హారాన్ని విజయవంతం చేద్దాం..
రాష్ట్ర పంచాయతీరాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు 

మన తెలంగాణ/వనపర్తి : ఈ నెలాఖరుతో సర్పంచ్ పదవీకాలం ముగియనున్నందున వచ్చే నెల నుండి గ్రామ పంచాయతీల పాలన సవ్యంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూ పల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురు వారం మంత్రి నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం నుండి అ న్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖాధికారులు, ఇతర శాఖాధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముం దుగా మంత్రి కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ,సర్పంచ్‌ల పదవి కాలం ఈనెల ఆఖరుతో ముగుస్తు న్నందున వచ్చే నెల నుండి గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3506 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారని, కొత్త గ్రామ పంచాయతీలతో కలిపి 12,500 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అన్ని గ్రామ పంచాయతీలకు పంచా యతీ కార్యదర్శులను కెటాయించాల్సిన అవసరం ఉందని ఆలోచించాలని, జిల్లా కలెక్టర్లు 3 రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అంతేకాక పాత 8 వేల గ్రామ పంచాయతీ లకు ప్రత్యేక అధికారులను ప్రత్యేకాధికారులను నియమించే ప్రక్రియ కూడా వెంటనే ప్రారంభించాలని, ఇందుకుగాను మండల, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని సూచించారు. ము ఖ్యంగా తహశీల్దార్లు, ఎంపిడిఒలు, డిప్యూటి తహశీల్దార్లు, ఈఒపిఆర్‌డిలు, మం డల వ్యవసాయాధి కారులు, పశుసంవర్థక శాఖాధికారులు , వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ రాజ్, ఆర్‌ఆండ్‌బి, ఇరిగేషన్, సిడిపిఒలు, తదితర అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని చెప్పారు. కొత్త గ్రామ పం చాయతీలకు భవనాలతో పాటు స్టేషనరీ, సిబ్బంది, రిజిస్టర్ల ఏర్పాటు, అలాగే కొత్త గ్రామ పంచాయతీల కు వచ్చే ఆస్తులు, భూములు, పంపిణీ చేయాలని తెలిపారు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు రోజున విస్తృత ప్రచారం నిర్వహించాలని , గ్రామాల్లో టాంటాం ద్వారా తెలియజేయాలని, అలాగే బాణా సంచా కాల్చాలని, సంబరాలు నిర్వహించాలని , గ్రామాల్లో పండగ వాతావరణం కల్పించాలని చెప్పారు. అంతేకాక గ్రామ పంచాయతీలకు సైన్ బోర్డు, సిటిజన్ చార్ట్, పంచాయతీ పరిధి తెలిపే మ్యాప్‌లను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. తెలంగాణకు హరిత హారం పై మంత్రి మాట్లాడుతూ వచ్చే సంవత్సరం వంద కోట్ల మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా నిర్ణయించినందున కొత్త గ్రామ పంచాయతీల్లో కూడా నర్సరీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నర్సరీల ఏర్పాటుకై క్లస్టర్లను ,స్థలాలను, గుర్తించాలని చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటేందుకు లక్షంగా నిర్ణయిం చిన దృష్టా హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తక్షణమే అన్ని మండలాల్లో ప్రత్యేక సర్వసభ్య సమావేశాలను నిర్వహించాలని , ఈ సమావేశాలకు అందరు ప్రజా ప్రతినిధులు , యువజన సంఘాలు, విద్యార్థులు, స్వచ్చంధ సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు హాజరుకావాలని , అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వాములను చేసి హరిత హారాన్ని విజయవంతం చేయాలని కోరారు. హరిత హారం కార్యక్రమంలో అన్ని రకాల మొక్కలు నాటాలని, మంచి వర్షాలు కురుస్తున్నందున పెద్ద ఎత్తున ఉధ్యమ రూపంలో కార్యక్రమం మొదలు పెట్టాలని మంత్రి తెలిపారు. అంతకు ముందు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా ప్రిన్సిపాల్ వికాస్‌రాజ్, కమీషనర్ నీతుప్రసాద్, హరిత హారం ప్రత్యేకాధికారి ప్రియాంకవర్గీస్‌లు మాట్లాడుతూ కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు ,వచ్చే సంవత్సరానికి నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం , తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వనపర్తి జిల్లా నుండి కలెక్టర్ శ్వేతామహంతి. డిపిఒ వీరబుచ్చయ్య, డిఆర్‌డిఒ గణేష్, డిఎఫ్‌ఒ బాబ్జిరావు, తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

Comments

comments