గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యా బోదన

హైదరాబాద్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలలో మరింత పట్టు సాధించేందుకు వినూత్నమైన డిజిటల్ స్టూడెంట్స్ డాట్ ఇన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అనుభావజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ పద్దతులతో భోధించడంతో పాటు వారి అనుమానాలను సైతం నివృత్తి చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్టు సంస్థ ఎండి సోమశేఖర్ తెలిపారు. గురువారం సోమాజిగూడాలోని సంస్థ కార్యాలయంలో వర్ధమాన తార మేఘన కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన డిజిటల్ […]


హైదరాబాద్: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలలో మరింత పట్టు సాధించేందుకు వినూత్నమైన డిజిటల్ స్టూడెంట్స్ డాట్ ఇన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అనుభావజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ పద్దతులతో భోధించడంతో పాటు వారి అనుమానాలను సైతం నివృత్తి చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్టు సంస్థ ఎండి సోమశేఖర్ తెలిపారు. గురువారం సోమాజిగూడాలోని సంస్థ కార్యాలయంలో వర్ధమాన తార మేఘన కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన డిజిటల్ విద్యా వ్యవస్థను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అందించాలన్న లక్ష్యంతో డిజిటల్ సేవలను ప్రారంభించినట్టు చెప్పారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్‌ మీడియట్ వరకు లైవ్, రికార్డింగ్ రూపంలో బోధన కొనసాగుతోందని చెప్పారు. ఉన్నత విద్యలు పూర్తి చేసి వృత్తిపరమైన కోర్సుల్లో శిక్షణ పొందేందుకు వందలాది మంది విద్యార్థులు నగరాలకు రావాల్సి వస్తోందని ఇది ఎంతో వ్యవప్రయాసలతో కూడుకున్న పని అన్నారు. ఇలాంటి వారికి సైతం నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఈ యాప్ దోహదపడుతుందన్నారు. ఇందు కోసం దేశంలోనే పేరుగాంచిన ఫ్యాకల్టిలతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.

Related Stories: