గ్రామాలను పరిశుభ్రం చేసే పని ఆగస్టు 15న ప్రారంభించాలి: సిఎం కెసిఆర్

హైదరాబాద్: సిఎం కెసిఆర్, మంత్రి జూపల్లి, అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలపై మంత్రి జూపల్లి, అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15 న ప్రారంభించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.  గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. గ్రామాలలో పరిశుభ్రం, పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై సిఎం కెసిఆర్ పలు సూచనలు చేశారు. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను […]

హైదరాబాద్: సిఎం కెసిఆర్, మంత్రి జూపల్లి, అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీలపై మంత్రి జూపల్లి, అధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో గ్రామాలను పరిశుభ్రం చేసే పనిని ఆగస్టు 15 న ప్రారంభించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.  గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. గ్రామాలలో పరిశుభ్రం, పచ్చదనం పెంచడానికి చేపట్టాల్సిన చర్యలపై సిఎం కెసిఆర్ పలు సూచనలు చేశారు. గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలి. రాబోయే 3 నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సిఎం అన్నారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పని చేపట్టాలి. గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికి వేతనాలు పెంచాలి, వివాహ, జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేయడంతో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా పంచాయతీలకు అప్పగించాలని ఆయన అన్నారు. పిచ్చి మొక్కలు, సర్కారు తుమ్మలు, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలని సిఎం కెసిఆర్ తెలిపారు.

Related Stories: