గ్యాప్ తీసుకుంటున్నారు

మహేశ్, రామ్‌చరణ్, ఎన్‌టిఆర్… ఇలా కొంతమంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ మరికొంత మంది హీరోలు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.  వరుసగా ప్లాపులు రావడం ఒకెత్తయితే… అనుకున్న స్థాయిలో ఇమేజ్ రాకపోవడం మరో కారణం. ఇలా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్న హీరోల జాబితాలో తాజాగా అల్లు అర్జున్ కూడా చేరాడు. ‘నా పేరు సూర్య’ చిత్రం నిరాశపరచడంతో బన్నీ తన కొత్త సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో […]

మహేశ్, రామ్‌చరణ్, ఎన్‌టిఆర్… ఇలా కొంతమంది హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. కానీ మరికొంత మంది హీరోలు గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.  వరుసగా ప్లాపులు రావడం ఒకెత్తయితే… అనుకున్న స్థాయిలో ఇమేజ్ రాకపోవడం మరో కారణం. ఇలా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్న హీరోల జాబితాలో తాజాగా అల్లు అర్జున్ కూడా చేరాడు. ‘నా పేరు సూర్య’ చిత్రం నిరాశపరచడంతో బన్నీ తన కొత్త సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొత్త కథ ఎంపికలో అతను తడబడుతున్నాడు. కాస్త గ్యాప్ తీసుకొని కొత్త కథలు వినడం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. దీంతో బన్నీ కొత్త సినిమా మొదలు కావడానికి చాలా సమయం పట్టనుంది. ఇక యంగ్ హీరో సాయిధరమ్‌తేజ్ కూడా గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో తేజు తన కొత్త సినిమాలను పెండింగ్‌లో పెట్టాడు.  కొంత కాలం తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టనున్నాడు. మరో యంగ్ హీరో రాజ్‌తరుణ్ ఈ ఏడాది ఫ్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టేశాడు. ఇటీవల వచ్చిన ‘లవర్’ పూర్తిగా నిరాశపరచడంతో ఈ హీరో కూడా గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు అతను తిరుపతి వెళ్లి గుండు చేయించుకున్నాడు. కాబట్టి మళ్లీ కొత్తగా జుట్టు వచ్చే వరకు రాజ్‌తరుణ్ సినిమాలు చేయడు. ఈ లిస్ట్‌లో  మంచు సోదరులు కూడా ఉన్నారు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరికి ఇటీవల కాలంలో పెద్దగా విజయాలు లేవు. ఇటీవల విష్ణు చేసిన ‘ఆచారి అమెరికా యాత్ర’, మనోజ్ చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో ఈ అన్నదమ్ములిద్దరూ కొన్నాళ్లు సినిమాలను పక్కనపెట్టారు. భార్యా పిల్లలతో మంచు విష్ణు ప్రస్తుతం యూరప్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. మంచు మనోజ్ కూడా విదేశాల్లోనే ఉన్నాడు. మళ్లీ ఈ హీరోలంతా ఎప్పుడు కెమెరా ముందుకొస్తారో చూడాలి.

Related Stories: