గౌతమిని ఆదుకుంటా:కెటిఆర్

మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సుద్దాల గౌతమి (18)ని ఆదుకుంటామని, వైద్య ఖర్చులు భరిస్తానని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో బుధవారం జరిగిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమానికి కెటిఆర్ హాజరుకాగా చిప్పలపల్లి గ్రామానికి చెందిన సుద్దాల గౌతమి తెర్లుమద్దిలో కెటిఆర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. నాలుగేళ్ల క్రితం రోడ్డు […]

మన తెలంగాణ / సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న సుద్దాల గౌతమి (18)ని ఆదుకుంటామని, వైద్య ఖర్చులు భరిస్తానని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో బుధవారం జరిగిన రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమానికి కెటిఆర్ హాజరుకాగా చిప్పలపల్లి గ్రామానికి చెందిన సుద్దాల గౌతమి తెర్లుమద్దిలో కెటిఆర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కుడి కాలుకు గాయం కాగా నాలుగేళ్లుగా రూ. ౩ లక్షల వ్యయం చేసి వైద్యం చేయించుకున్నా కుడికాలిలోని ఎముక బాగుపడలేదని అలాగే ఎముక నొప్పి కొనసాగుతుందని మెడికల్ రిపోర్టులను మంత్రి కెటిఆర్‌కు చూపించగా గౌతమి కాలు బాగయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును తాను భరించి ఆదుకుంటానని కెటిఆర్ హామీ ఇచ్చారు.

Comments

comments

Related Stories: