గోదావరి నీరు వృథా

  • వెక్కిరిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు
  • వృథాగా సముద్రంలో కలుస్తున్న నీరు
  • దశాబ్దాలు దాటుతున్నా పూర్తికాని ప్రాజెక్టులు

Khammam_Godavari_Waterఖమ్మం : చెంతనే గోదావరి , సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుంటే తెలంగాణ మాగాణుల్లో పసిడి పంటలు పండుతాయి. ఈ మాటలు అక్షర సత్యం. కానీ పాలకుల  నిర్లక్షం రైతులకు శాపంగా మారింది. కొన్ని ప్రాజెక్టులు సర్వేలకే పరిమితం కావడం, మరికొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టి దశాబ్దాల కాలం కావస్తున్నా బాలారీష్టాలు దాటకపోవడం శోచనీయం. కృష్ణ బేసిన్‌లో తీవ్రమైన నీటి కొరత ఉన్న ప్రస్తుత స్థితిలో గోదావరి నుంచి సముద్రంలోని వందల టిఎంసిల నీరు చేరుతుంది. ఈ ఏడాది కూడా జూన్ మాసంలో సుమారు 40 అడుగల వరకు గోదావరి వరద వచ్చింది. ప్రసుతం కూడా గోదావరిలో 17.08 అడుగుల నీరు ఉంది.  ల్లాలో గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు పూర్తైయితే జిల్లాలో ఇంతటి వర్షభావ పరిస్థితిల్లో సైతం సాగునీరు సమస్య తలెత్తేది కాదు. గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలని జిల్లా ప్రజలు చేసిన అనేక పోరాటాల ఫలితంగా 2005 డిసెంబర్ 31న దుమ్ముగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆప్పటి కాంగ్రెస్‌లో వర్గపోరు కారణంగా ప్రాజెక్టు రెండుగా విడగొట్టబడిన సంగతి విధితమే. (దుమ్ముగూడెం – రాజీవ్‌సాగర్, ఇందిరా సాంగర్). ఈ ప్రాజెక్టు 2009 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రాజీవ్‌సాగర్ ప్రాజెక్టును పూర్తి చేసి నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు అనుసంధానం చేస్తే దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో పంటలకు సంవృద్ధిగా సాగునీరు అందేది. రాజీవ్‌సాగర్‌పై రూ.750 కోట్లు ఖర్చు చేసినా, ప్రాజెక్టు పనులు ప్రారంభమైన దశాబ్ద కాలం పూర్తి కావస్తున్నా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు అనుసరించిన నిర్లక్ష వైఖరి ఈ పరిస్థితికి దారితీసింది. దుమ్ముగూడెం ప్రాజెక్టుకు ఎగువన తాలిపేరు గోదావరిలో కలుస్తుండటంతో ఎత్తిపోతల పథకానికి (రాజీవ్‌సాగర్) నీటి సమస్య ఉత్పన్నం కాదు. అలాగే ఇందిరాసాగర్ ఎత్తిపోతలకు ఎగువన, శబరి నది గోదావరిలో కలుస్తుండటంతో పుష్కలంగా నీరు ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కనీస నీటిమట్టానికి చేరుకున్న తరుణంలో గోదావరి జలాలను సద్వినియోగంలోనికి తెచ్చినట్లయితే రైతాంగానికి సాగునీటి ఇబ్బందులు తొలగేవి. నీరు లభ్యం కాని చోట పొరుగు రాష్ట్రాలతో పోరు చేసి సాధించే దానికి ముందు వృథాగా పోతున్న నీటిని సద్వినియోగంలోనికి తేవాలని రైతాంగం కోరుతోంది. మళ్లీ డిజైన్ మార్పు అంటూ రూ.1800 కోట్లను మట్టిపాలు చేయకుండా వీలైనంత త్వరగా దుమ్ముగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

Comments

comments