గోడ మీద గోండు కళ

Art1

ఆదిలాబాద్ జిల్లా జెయినూర్ మండలం, గోండు గ్రామం రాశిమెట్ట. అక్కడ మట్టిగోడలపై ఉప్పపూవు బొమ్మలను తెల్లసుద్దతో దిద్దుతున్నాడు రాజేశ్వర్. అతడి కళను గుర్తించిన టీచర్లు పదో తరగతి తర్వాత హైదరాబాద్ పోయి జేఎన్‌టీయూలో చేరుబిడ్డా అని సలహా ఇచ్చారు. అలా జేఎన్టీయూ ఫైనార్ట్‌కాలేజీలో జాయిన్ అయి ఇప్పుడు రెండోసంవత్సరం చదువుతున్నాడు. ఒకసారి మాసాబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లోని ట్రైబల్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్లినప్పుడు రంగులు వెలసిన గోడలు కళాకాంతులు లేకుండా కనిపించాయి. ఆ వాతావరణం అక్కడికి నిత్యం వచ్చే ప్రజలకు నీరసం వచ్చేలా ఉండటం గమనించాడు. ఆ గోడలను కళాత్మకంగా తీర్చిదిద్దితే, ఎలా ఉంటుందన్న ఆలోచనను తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల ముందుంచాడు.

సర్కారీ గోడలకు కొత్త శోభ : రాజేశ్వర్ ఆలోచన కార్యరూపం అందుకుంది. సంక్షేమభవన్‌లోని గిరిజన శాఖ ఎదురుగా ఉన్న గోడను కళాత్మకంగా తీర్చిదిద్దే అవకాశం ఇచ్చారు. తనతో పాటు చదువుతున్న మరో పదిమందిని కలుపుకొని గోండు ఆర్ట్‌ని సమాజానికి పరిచయం చేయబోతున్నామని, మరిన్ని సర్కారీ ఆఫీసులను కళాత్మకంగా తీర్చిదిద్దబోతున్నట్టు, మన తెలంగాణకు చెప్పాడు రాజేశ్వర్.

శ్యాంమోహన్

మన తెలంగాణ ప్రతినిధి

Comments

comments