గోంగూర మటన్….

Curry

గోంగూర మటన్ 

కావలసిన పదార్థాలు
మటన్ : అరకిలో, పసుపు : తగినంత
వెల్లుల్లి రేకలు : 10, పచ్చిమిరపకాయలు : 6
కారం : 2 టీస్పూన్లు, నూనె : 3 స్పూన్లు
లవంగాలు, యాలకులు : 4 చొప్పున
బిర్యానీ ఆకులు : 2, దాల్చిన చెక్క : 1
గోంగూర ఆకు : 250గ్రా..
ఉల్లిపాయ : 1, కరివేపాకు : 1 రెబ్బ
కొత్తిమీర : 1 కట్ట, ఉప్పు : తగినంత
తయారీ విధానం
* మాంసాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద, సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి.* మూడు విజిల్స్ వచ్చాక దించేసి పక్కన పెట్టుకోవాలి.
* ఇప్పుడు స్టౌమీద వెడల్పాటి గిన్నె పెట్టి, సరిపడా నూనె పోసి వేడెక్కాక లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క వేసి వేయించుకోవాలి.* తరువాత పచ్చిమిరపకాయలు, అల్లంవెల్లుల్లిముద్ద, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గోంగూర వేసి మగ్గనివ్వాలి. * ఇప్పుడ ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాలపాటు ఉడికించి దించేయాలి. * దీన్ని కొత్తిమీరతో అలంకరించుకోవాలి.

డ్రమ్‌స్టిక్స్ దాల్చా

కావలసిన పదార్థాలు
మాంసం : కిలో, ఎర్ర కందిపప్పు : 100 గ్రా.., శనగపప్పు : 50 గ్రా.,
ఆవాలు : టీ స్పూను
లవంగాలు : 4, దాల్చినచెక్క : 2
వెల్లుల్లిపాయ : ఒకటి ,
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూను
కరివేపాకు : 2 రెబ్బలు , ఎండుమిర్చి: 10, మునగకాయలు: 2, పుదీనా తురుము : 2 టీ స్పూను
మామిడికాయ పొడి : 2 టీ స్పూను , కారం, పసుపు : టీ స్పూను చొప్పున , నెయ్యి : 50గ్రా.., మటన్ స్టాక్ : లీటరు, నూనె : తగినంత , ఉప్పు : తగినంత
తయారీ విధానం
* మటన్ ముక్కల్ని నీళ్లు పోసి సగం ఉడికేవరకు ఉంచాలి. తరువాత నీటిని విడిగా తీసి ఉంచాలి. అదే మటన్ స్టాక్‌గా వాడాలి. * ఎర్ర కందిపప్పు, శనగపప్పు కడిగి ఓ గంటసేపు నానబెట్టాలి. * బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి, మటన్ ముక్కలు, నానబెట్టిన పప్పులు, మునగకాయ ముక్కలు వేసి వేయించాలి.
* మటన్ స్టాక్ పోసి మటన్ ముక్కలు పూర్తిగా ఉడికేవరకు ఉంచాలి. * మరో బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
* తరువాత ఉల్లి ముక్కలు కూడా వేసి వేగాక ఉడికించిన మటన్ మిశ్రమాన్ని వేసి కలిపి దించాలి. * చివరగా మామిడికాయ పొడి, మిగిలిన నెయ్యి, పుదీనా తురుము వేసి అలంకరించాలి.

ఔరంగాబాద్ మటన్

కావలసిన పదార్థాలు
మటన్ ముక్కలు : కిలో
నూనె : సరిపడా
ఉల్లిపాయలు : పావుకిలో
అల్లం వెల్లుల్లి : 4 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి : 3 టేబుల్ స్పూన్లు
పసుపు : టీ స్పూను
కారం : 4 టీ స్పూన్లు
కొత్తిమీర తువుము: టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
గరంమసాలా కోసం
యాలకులు : టీ స్పూను
షాజీరా : టీ స్పూను
జాజికాయ పొడి : టీ స్పూను
లవంగాలు : టీ స్పూను
మిరియాలు : టీ స్పూను
దాల్చినచెక్క : 2అంగుళాల ముక్క

తయారీ విధానం

* గరంమసాలా కోసం తీసుకున్నవన్నీ వేయించి పొడి చేయాలి. * ప్రెషర్‌పాన్‌లో నూనె వేసి ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి వేయించాలి. * తరువాత మటన్ ముక్కలు, పసుపు వేసి ఉడికించాలి. * ఇప్పుడు ధనియాల పొడి, కారం, ఉప్పు, గరంమసాలా వేసి కలిపి సిమ్‌లో పెట్టి, సరిపడా నీళ్లు పోసి మాంసాన్ని మెత్తగా ఉడికించి దించాలి.* చివరగా కొత్తిమీర తురుముతో అలంకరిస్తే సరి.

Comments

comments