గొల్ల, కుర్మల సంక్షేమమే లక్ష్యం

ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ మనతెలంగాణ/జగిత్యాల: రాష్ట్రంలోని గొల్ల, కుర్మల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్ర వేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం స్థానిక విరూపాక్షి గార్డెన్‌లో గొర్రెల అభివృద్ది ప థకం కింద జిల్లాలో రెండో విడత గొర్రెల యూనిట్ల పం పిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డితో కలిసి ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని విధంగా గొల్ల, […]

ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్

మనతెలంగాణ/జగిత్యాల: రాష్ట్రంలోని గొల్ల, కుర్మల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్ర వేశపెట్టిందని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం స్థానిక విరూపాక్షి గార్డెన్‌లో గొర్రెల అభివృద్ది ప థకం కింద జిల్లాలో రెండో విడత గొర్రెల యూనిట్ల పం పిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డితో కలిసి ఈశ్వర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో అమలులో లేని విధంగా గొల్ల, కుర్మలు ఆర్థికం గా అభివృద్ధి చెందేలా గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడ్డ వారికి చేయూతనందించి మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకం రూ పొందించినట్లు తెలిపారు.మొదటి విడతగా జిల్లాలో 97 38 మంది లబ్దిదారులకు 2,04,498 గొర్రెలు పంపిణీ చే యగా వాటికి 71,441 గొర్రె పిల్లలు పుట్టాయన్నారు. ప్ర భుత్వం పంపిణీ చేసిన గొర్రెలు ఏడాదిలో 33శాతం వృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80లక్షల గొర్రెల పంపి ణీ అంత సాధ్యమైన పని కాదని,అయినా నిర్దేశించుకున్న లక్షం మేర గొర్రెల పంపిణీ కార్యక్రమం సాగుతోందన్నా రు. చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుని ఇబ్బందులు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.
పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లను లబ్ధిదారులు అమ్మకుండా వృద్ధి చేసి రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు మ నం సరఫరా చేసే స్థాయికి ఎదగాలన్నారు. గొర్రెలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలందించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 1962 సంచార పశు వైద్యశాలలు ఏర్పాటు చేయడంతో పాటు దాణాను అందిస్తున్నామన్నారు. రూ. 82 వేలతో గొర్రెల షెడ్డులు మంజూరు చేశామని, చనిపోయిన 4,966 గొర్రెలకు బీమా వర్తించేలా చర్యలు చేపట్టి వాటి స్థానంలో కొత్తగా గొర్రెలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరంలో మొదటి విడత రాష్ట్రంలోనే మన జిల్లాలో గ్రౌండింగ్ చేశామని, ఈ సంవత్సరం కూడా త్వరితంగా పూర్తి చేసి రాష్ట్రంలో ముం దంజలో నిలిచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. స్థానిక ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కుల వృత్తులను ప్రోత్సహించాలనే భావనతో చేపట్టిన ఈ కార్యక్రమం గొల్ల, కుర్మలకు మేలు చేస్తోందన్నారు. లక్ష సాధనతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లబ్దిదారులు గొర్రెల ను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుందనే విషయమై ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు. సామాజిక సర్వే నిర్వహిస్తే సమస్యలను అధిగమించి, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. చనిపోయిన గొర్రెల స్థానంలో ఇప్పటికీ గొర్రెలు అందక లబ్దిదారులు ఆ ందోళన చెందుతున్న నేపథ్యంలో వెంటనే వారికి గొర్రెలను అందించే ఏ ర్పాట్లు చేయాలన్నారు.
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, గత సంవత్సరం లబ్ధిదారులు, సహకార సంఘాల సహకారంతో పశు సంవర్దక శాఖ అధికారుల కృషితో లక్షం మేరకు 9738 యూనిట్లను అందించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచామన్నారు. ఈ సంవత్సరం కూడా నిర్దేశిత సమయంలో లక్షాన్ని చే రుకునేలా అధికారులు పని చేయాలన్నారు.గొర్రెల యూనిట్లు విక్రయించకుండా నిఘా కోసం చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని,గతంలో విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గొర్రెలకు ఎప్పటికప్పుడు వైద్యసేవలందించేందుకు ప్రతి మండలానికి ఇద్దరు ముగ్గురు వైద్యులు,సహాయకులను అందుబాటులో ఉంచామని, వై ద్యుల ఫోన్ నెంబర్లను గ్రామాల్లోని గోడలపై ప్రదర్శిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్‌డిఒ నరేందర్, పశు సంవర్దక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ అశోక్‌రాజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, జడ్‌పిటిసిలు నాగలక్ష్మి, ప్రశాంతి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Stories: