గొర్రెల పంపిణీ అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం

గులాబీ కండువాలు కప్పుకుంటేనే గొర్లు ఇస్తారా..? కాంగ్రెస్ ధర్నాలో నాగం, రేవంత్, డికే అరుణ మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా కురుమయాదవులకు పంపిణీ చేసిన గొర్రెల అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కాంగ్రేస్ పార్టి నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి , ఎమ్మేల్యేలు రేవత్‌రెడ్డి, డికే అరుణలు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని బస్ డిపో వద్ద గొర్రెల పంపిణీలో అవినీతిపై ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్టిలు, మైనారిటీల 12 […]

గులాబీ కండువాలు కప్పుకుంటేనే గొర్లు ఇస్తారా..?
కాంగ్రెస్ ధర్నాలో నాగం, రేవంత్, డికే అరుణ

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా కురుమయాదవులకు పంపిణీ చేసిన గొర్రెల అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని కాంగ్రేస్ పార్టి నాయకులు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి , ఎమ్మేల్యేలు రేవత్‌రెడ్డి, డికే అరుణలు అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని బస్ డిపో వద్ద గొర్రెల పంపిణీలో అవినీతిపై ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా నాగం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్టిలు, మైనారిటీల 12 శాతం రిజర్వేషన్‌లను గాలికొదిలి ప్రజలకు గొర్రెలు, బర్రెలు, చేపలతో మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రైతుబంధు పేరుతో ఎరువుల ధరలు పెంచారన్నారు. ప్రాజెక్టులు, సంక్షేమం పథకాల అమలులో జరుగుతున్న అవినీతిపై పోరాడతామన్నారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి కురుమయాదవులకు గొర్రెల యూని ట్లు అందిస్తామని డబ్బులు కట్టించుకొని టిఆర్‌ఎస్ కండువలు వేసుకున్న వారికే ఇస్తున్నారని, కండువ వేసుకోని వారిని విస్మరిస్తున్నారన్నారు. గొర్ల కొనుగోళ్లు, రవాణ, దాణా, ఇన్సురెన్సు పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. లబ్దిదారుల ఖాతాలో సబ్సిడీ డబ్బులు వేస్తే వారే కొనుగోలు చేసుకుంటారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీనివాస్‌యాదవ్‌లపై తీవ్ర ఆరోపణలు చెశారు. డికే అరుణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కులాల పేరున కుట్ర చేస్తుందన్నారు. హక్కులపై ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలు, పార్టిల నాయకులను హైదరాబాద్ వరకు రాకుండా ఇక్కడే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రేస్ హయంలో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయంలోనే గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారన్నారు. 2011లో ఎన్‌టిడిఎస్ పథకం ద్వారా గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిష్పక్షపాతంగా సొసైటీలను స్థాపించి ఈ పథకం దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట్ మాజి ఎమ్మేల్యే వంశీకృష్ణ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రేస్‌పార్టి అధ్యక్షులు ఒబేదుళ్లా కోత్వాల్, మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలు కొండామనెమ్మ, దేవరకద్ర పార్టి ఇన్‌చార్జి పవన్‌కుమార్, సిఆర్ జగదీశ్వర్‌రావు, పార్టి జిల్లా అధికార ప్రతినిధి సతీష్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు.

Related Stories: