గొర్రెల వ్యానును ఢీకొట్టిన లారీ: ఒకరి మృతి

Sheep

కోరుట్ల: వ్యానును లారీ ఢీకొట్టిన ఘటన జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం మోహన్‌రావుపేటలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.  గొర్రెల లోడుతో వెళ్తున్న వ్యానును ఓ లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో ఒకరు దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 120 రాయితీ గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మహారాష్ట్ర నుంచి కరీంనగర్ జిల్లాకు   తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

comments