“గే”లిచారు…

Supreme Court Discontent on High Court Judgement on GO no 550

ఢిల్లీ: స్వలింగసంపర్కంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. స్వలింగసంపర్కం నేరం కాదని తెలిపింది. రాజ్యాంగంలోని 377 అధికరణను కొటివేస్తూ తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం తీవ్రమైన నేరమనే వాతావరణాన్ని మన సమాజంలో చాలా సంవత్సరాలుగా సృష్టించారని, ఆ వర్గం పట్ల బలంగా నాటుకు పోయిన వివక్షకు అదే కారణమని స్వలింగ సంపర్కాన్ని నేరంగా  పేర్కొంటున్న భారత శిక్షాస్మృతి(ఐపిసి)లోని 377సెక్షన్‌ను కొట్టివేసింది. స్వలింగ సంపర్కుల పట్ల వివక్ష వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావానికి కారణమవుతోందని పేర్కొంది. స్వలింగ సంపర్కులు  మిగతా వారికి లభించే హక్కుల్లో దేన్నయినా పొందకుండా అడ్డుకొనే  చట్టం, నిబంధన, సబ్ లా, లేదా మార్గదర్శకం నిబంధన ఏదీ లేదని కోర్టు సమాధానమిచ్చింది. దీంతో పరస్పర అంగీకార స్వలింగ సంపర్కం  నేరంగా పరిగణిస్తున్న కారణంగానే  ఆ వర్గం సమాజంనుంచి ఏవగింపును ఎదుర్కొంటోందని, అది పోతే వివక్ష, ఏవగింపు లాంటివన్నీ పోతాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నారిమన్, ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ఐపిసి లోని 377వ సెక్షన్  ‘అసహజ నేరాల’ గురించినది. ఒక మగవాడితో, లేదా స్త్రీతో, లేదా జంతువులతో అసహజంగా రతి జరిపిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా, విచక్షణ ఆధారంగా పదేళ్ల దాకా  జైలు శిక్ష,  జరిమానా విధించవచ్చని 377 సెక్షన్ చెబుతోంది.

Comments

comments