గుర్రం, కుక్క…చాకోలేట్స్, బోన్స్ అవార్డ్స్.. ఏంటా కథ…?

braveryaward1

థండర్ స్ట్రామ్.. పైన ఫోటోలో కనిపిస్తున్న గుర్రం పేరు, సోఫియా… ఫోటోలోని కుక్క పేరు. ఇప్పుడు వీటి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఇవి సాదాసీదా జంతువులు కాదు… ఇంతవరకు చరిత్రలోనే బతికి ఉండి ఇంకా సర్వీస్ చేస్తున్న జంతువులకు ఇటువంటి అవార్డులు ఇచ్చింది లేదు. కాని, వీటికి ఆ అరుదైన గౌరవం దక్కింది. థండర్ స్ట్రామ్ కు జీవిత కాలం తినే చాకోలేట్స్, సోఫియాకు జీవిత కాలం తినే బోన్స్ ఇస్తూ… టేస్టీ బ్రేవరీ అవార్డును ప్రకటించారు.

ఇండో టిబెటన్ బార్డర్ లో కాపల కాసే పోలీసులకు చేసిన సహాయానికి మెచ్చుకొని ఈ అవార్డులను ఇస్తున్నారట. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ కృష్ణ చౌదరి థండర్ స్ట్రామ్ ను ఎటి(ఆనిమల్ ట్రాన్స్ పోర్ట్) మెడల్ తో, సోఫియాను ఐటిబిపి కెనైన్ మెడల్ తో సత్కరించనున్నాడట.

braveryaward

గ్రేటర్ నోయిడాలోని సురాజ్ పూర్ లో ఉన్న 39 బెటాలియన్ క్యాంపస్ లో జరిగే 55వ రైజింగ్ పెరెడ్ లో వీటికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారట.

అయితే, థండర్ స్ట్రామ్ తన శక్తి సామర్థ్యాలకు గాను ఇదివరకే 7 మెడల్స్ ను సాధించిందట. ఇక, సోఫియా ఒక గోల్డ్ మెడల్ ను సాధించిందట. అందుకే, ఈ సారి డిఫరెంట్ గా వాటిని సత్కరిస్తున్నారట.

ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ ఉన్న ఏరియాల్లో థండర్ స్ట్రామ్ ప్రయాణించి అక్కడి పోలీసులకు ఎంతో సాయం చేసిందట. ఇక, సోఫియా మాత్రం మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్ గఢ్ లో పోలీసులతో పహారా కాసేదట. అంతేకాదు, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, ఫ్రెంచ్ ప్రధాన మంత్రి మాన్యువల్ వాల్స్ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషించిందట సోఫియా. ఇంకా, ఢిల్లీలోని పార్లమెంట్, ఎర్రకోట సెక్యూరిటీ కోసం సోఫియానే ఉపయోగించారట.

దేశాన్ని రక్షించడం కోసం ఇన్ని సేవలు చేసిన థండర్ స్ట్రామ్, సోఫియాలకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే.. ఏమంటారు?

Comments

comments