గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Police finde out Elderly dead body in rajanna siricilla

రుద్రంగి: రుద్రంగి మండల కేంద్రంలో అటవీ ప్రాంతంలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని గండి వెంకటేశ్వరస్వామి దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక వృద్ధురాలి(60) మృతదేహం లభ్యమైంది. ఆమె గతంలో మతిస్థిమితం లేక రుద్రంగి గ్రామంలోని బస్టాండ్ లో బిక్షాటన చేసేదని స్థానికులు తెలిపారు. వృద్ధురాలు 10 నుండి 15రోజుల క్రితం నడుచుకుంటూ అటవీలోకి వచ్చి తినడానికి ఆహారం లేక ఆకలితో చనిపోయినట్టు ఎస్‌ఐ విద్యాసాగర్‌రావు తెలిపారు. సంఘటన స్థలాన్ని చందుర్తి సిఐ విజయ్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.

Comments

comments