గుర్తు తెలియని కాలిన మృతదేహం లభ్యం

Unknown dead body found at mahabubabad
నర్సింహులపేట:  మండలంలోని వస్రారంతండా గ్రామ పంచాయతీ శివారులోని పాశం బోడుపై గుర్తు తెలియని కాలిన మృతదేహం లభ్యమైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు విఆర్‌వొ ఫిర్యాదుపై ఎస్‌ఐ సంతోష్‌రావు ఘటన స్థలానికి చేరుకుని పూర్తిగా కాలిపోయిన గుర్తు తెలియని మృతదేహంను గుర్తించారు. ఘటన స్థలాన్ని ఎస్పి నంద్యాల కోటిరెడ్డి సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మృతదేహంపై పెట్రోలు గాని లేక కిరోసిన్ పోసి కాల్చేయవచ్చని, పూర్తిగా కాలిన ఎముకలు,పుర్రె మాత్రమే ఉన్నాయన్నారు. మృతదేహానికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదన్నారు. పోలీసులను బృందాలుగా ఏర్పాటు చేసి చుట్టుపక్కల వారిపై ఆరా తీసి నిందితులను పట్టుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. పుర్తిగా కాలిన ఎముకలు,పుర్రెను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి నివేదిక అందిన వెంటనే మృతదేహాం ఆడ లేక మగ గుర్తించడం జరుగుతుందని తెలిపారు.  నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన  తెలిపారు. తహసీల్థారు సమక్షంలో కాలిన మృతదేహాంకు పంచినామ చేసి కేసు నమోదు చేసి దర్యాపు చేపడుతున్నట్లు ఎస్పి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాజరాత్నం, సిఐ చేరాలు, తహసీల్థారు ప్రసాద్‌రావు,విఆర్‌వొ,పోలీసు సిబ్బంది ఉన్నారు.

Comments

comments