గుణ‘పాఠం’ నేర్చేదెన్నడు?

పాఠశాలల్లో వృథాగా కంప్యూటర్లు ఏళ్లుగా కరువైన బోధన ఐదేండ్ల ఒప్పందంతో 502 మంది తాత్కాలిక బోధకులు కంప్యూటర్ తరగతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థులు పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను పంపిణీ చేసింది. ఒప్పందం గడువు ముగిసిన తర్వాత పట్టించుకునే వారు లేక కంప్యూటర్లన్నీ పనికి రాకుండా […]

పాఠశాలల్లో వృథాగా కంప్యూటర్లు
ఏళ్లుగా కరువైన బోధన
ఐదేండ్ల ఒప్పందంతో 502 మంది తాత్కాలిక బోధకులు
కంప్యూటర్ తరగతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థులు

పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను అందించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్లను పంపిణీ చేసింది. ఒప్పందం గడువు ముగిసిన తర్వాత పట్టించుకునే వారు లేక కంప్యూటర్లన్నీ పనికి రాకుండా పోతున్నాయి. బోధకులు లేక చాలా పాఠశాలల్లో ఐదేండ్లుగా కంప్యూటర్ విద్య అటకెక్కింది. 

మన తెలంగాణ/ఖమ్మం విద్యావిభాగం : 2008లో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం నిట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 251 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు రెండు విడతలుగా కంప్యూటర్లను అందజేసింది. 2008లో 198 పాఠశాలలు, 2009లో 53 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, విద్యుత్తు లేని సమయంలో వాడుకునేందుకు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఐదేండ్ల ఒప్పందంతో పాఠశాలకు ఇద్దరు చొప్పున 502 మంది తాత్కాలిక బోధకులను నియమంచారు. తరగతుల వారీగా అంశాలను రూపొందించి పుస్తకాలను విద్యార్థులకు అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏవిధంగా బోధించాలనే విషయంపై నిట్ సంస్థ బోధకులకు పూర్తి శిక్షణనిచ్చింది. విద్యార్థులు సైతం బోధకులు బోధించిన అంశాలను చక్కగా నేర్చుకున్నారు. ఒప్పందం పూర్తయిన అనంతరం ఆయా పాఠశాలల్లో శిక్షకులు లేక కంప్యూటర్ బోధన ఆగిపోయింది. ప్రత్యేక గదులు కేటాయించి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు మూలకు చేరాయి. వీటి కోసం కేటాయించిన జనరేటర్లు, ఫర్నీచర్  పాడవుతున్నాయి. అనంతరం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే పరిమితమయ్యాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన సబ్జెక్టులకే సమయం సరిపోతుండడం. ఇతర బాధ్యతలతో వీటిపై దృష్టిపెట్టలేదు. కొన్ని పాఠశాలల్లో పాఠశాల నిర్వహణకు సంబంధించి ఒకట్రెండు కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. ఆధునీక యుగంలో కంప్యూటర్లకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని మూడనపడేయడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో వెనుకపడే ప్రమాదం ఉంది. తరగతుల నిర్వహణకు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే కొంత వరకు ప్రయోజనం కలుగనుంది. పాఠశాల యాజమాన్యం కమిటీల సమావేశాల్లో చర్చించి పాఠశాల నిర్వహణ గ్రాంటు ద్వారా శిక్షకులను ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులో కొంత చొరవ తీసుకుంటే విద్యర్థులకు మేలు జరుగుతుంది. రెండేళ్ల క్రితం కంప్యూటర్ స్థితిగతులపై వివరాలు సేకరించి నిపుణులు వీటిలో చాలా వరకు పాడైనట్లు తేల్చారు. నిర్వహణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ తరగతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
నేర్చుకోవాలని ఆసక్తి : ఇప్పటి వరకు కంప్యూటర్ గురించి అసలేం తెలియదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా నేర్పించే వారు లేకపోవడంతో వాటి గురించి తెలుసుకోవాలనే అవకాశం లేకుండా పోయింది. తరగతులు ప్రారంభించి విద్యార్థులందరికీ నేర్పిస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.
– విజిత, 8వ తరగతి విద్యార్థిని

భవిష్యత్తులో ఎంతో అవసరం : నేటి సమాజంలో అన్ని రంగాల్లో కంప్యూటర్ల వాడకం తప్పనిసరిగా మారుతుంది. భవిష్యత్తులో పోటీ పరీక్షలు రాయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరం. ఐదేండ్లుగా మా పాఠశాలలో కంప్యూటర్ తరగతులు నిలిచిపోయాయి.
– కె.ఆదాం, ఉపాధ్యాయుడు

Related Stories: