గుండె పోటుతో ఉపాధ్యాయుడు మృతి

Teacher Dies With Heart Attack In Warangal District

దామెర :విద్య కుసుమం కనుమరుగయింది.  బయ్య రవి చల్వాయి గ్రామంలో ఉపాధ్యాయ వృత్తి రిత్య విధుల్లో ఉండగానే గుండెపోటు రావడంతో కూర్చున్న కుర్చిలోనే కుప్పకూలి పోయారు. సహా ఉపాధ్యాయులు గమనించి దగ్గరలో ఉన్న ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లగా అప్పటికే అతను మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన విద్యార్థులు మిన్నంటిన రోధనలతో స్కూల్ ముగిసిన కాని ఆ ఉపాధ్యాయుని కడసారి చూపుకోసం విక్షించారు. ఆత్మకూర్‌లో నేటి యువత తన విద్యార్థులే బయ్య రవి ఆత్మకూర్ మండలానికి దొరికిన ఒక వజ్రం లాగా ప్రతి ఒక విద్యార్థి భావిస్తారు. 1992 నుండి చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి మంచి క్రమ శిక్షణతో కూడిన విద్యా బుద్దులు నేర్పిన మహానుభావుడు.
 ఆత్మకూర్‌లో విషాదచాయలు
బయ్య రవి మృతితో ఆత్మకూర్ మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రతి విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పి మంచి క్రమ శిక్షణతో మెలగాలని నేర్పిన గురువు లేడని తెలిసిన ఆత్మకూర్ మండల ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. రోధనలతో ఆత్మకూర్ గ్రామం మార్మోగిపోయింది.

Comments

comments