గుండెపోటుతో వ్యక్తి మృతి…

Man Died with Heart Attack

కొండమల్లెపల్లి: గుండెపోటు తో రోడ్డుపైనే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండల కేంద్రంలోని నాగర్జున సాగర్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు, ప్రయణికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన వీర్లపల్లి భాస్కర్ (50) గత 30 సంవత్సరాలుగా కొండమల్లెపల్లి పట్టణంలోని సాగర్‌రోడ్డులో లారీల కమాన్ పట్టాల షాపులో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే శనివారం ఉదయం విధులు నిర్వహిస్తూ దప్పిక వేయడంతో పక్కనే ఉన్న కూల్‌డ్రింగ్ షాపు వద్దకు వెళ్లి మంచినీళ్లు తాగాడు. తిరిగి షాపు వద్దకు వెళ్తున్న క్రమంలో  గుండెనొప్పి రావడంతో ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలీపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య గతంలో చనిపోయింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బంధువులు వెంటనే వచ్చి మృతదేహన్ని ఆటోలో మృతుని స్వగ్రామమైన దేవరకొండకు తరలించారు. ఈ విషయంపై పోలీసులను సంప్రదించగా ఈ విషయంపై కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ శంకర్‌రెడ్డి తెలిపారు.

Comments

comments