గుండారం తండాలో ఎక్సైజ్ దాడులు…

ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామ పరిధిలోని నర్సింహగుట్ట తండాలో శనివారం ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి బెల్లం పాకం, ఇప్పపువ్వు పాకాన్ని ధ్వంసం చేసి నాటు సారాయి స్వాధీనం చేసుకున్నట్టు సిఐ ఎంపిఆర్ చంద్రశేకర్ పేర్కొన్నారు. సిఐ వివరాల ప్రకారం… తండాలో నాటు సారాయి తయారు చేస్తున్నరనే సమాచారంతో సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో తండాలో పలు చోట్ల గిరిజనులు సారాయి తయారి కోసం తయారు […]


ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామ పరిధిలోని నర్సింహగుట్ట తండాలో శనివారం ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించి బెల్లం పాకం, ఇప్పపువ్వు పాకాన్ని ధ్వంసం చేసి నాటు సారాయి స్వాధీనం చేసుకున్నట్టు సిఐ ఎంపిఆర్ చంద్రశేకర్ పేర్కొన్నారు. సిఐ వివరాల ప్రకారం… తండాలో నాటు సారాయి తయారు చేస్తున్నరనే సమాచారంతో సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో తండాలో పలు చోట్ల గిరిజనులు సారాయి తయారి కోసం తయారు చేసిన బెల్లం పాకం, ఇప్పపువ్వు పాకం సుమారు 50లీటర్లు లభించగా దానిని పారబోశారు. అనంతరం రవాణాకు సిద్దంగా ఉన్న రెండు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. భూక్య పంత్యుల్యా అను వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐలు కిషన్, సుస్మిత, సిబ్బంది వెంకటేశ్వర్‌రావు, హమీద్, సుమన్, క్రిష్ణకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments