“గీత గోవిందం”బాగుంది: మహేశ్ బాబు

Geetha Govindam is a Winner: Mahash Babu

హైదరాబాద్: విజయ్ దేవరకొండ నటించిన “గీత గోవిందం” సినిమా బుధవారం విడుదలైంది. ఈ మూవీకి అభిమానుల నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. గత రాత్రి మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి సినిమాను వీక్షించారు. సినిమా చాలా బాగుందని, విజయ్ దేవరకొండ, రష్మిక మందన అద్భుతంగా నటించారని కొనియాడారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించగా గీత ఆర్ట్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మించారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి మూవీలో మహేష్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం మహర్షి సినిమా టైటిల్‌ను, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Comments

comments