గిరిజన విద్యార్థికి మెడిసిన్‌లో సీటు

Seat in medicine to tribal student

మహాముత్తారం : నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టిన విద్యార్థి మెడిసిన్‌లో సీటు సంపాదించాడు. వివరాలోకి వెళ్ళితే… మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన జాటోత్ రాజునాయక్-, దేవిబాయిల కుమారుడు అరవింద్ నాయక్ ఎంబిబిఎస్‌లో సీటు సంపాదించాడు. తల్లి దండ్రులు కూలీ నాలీ చేసి ఇంటర్మీడియట్ వరకు చదివించారు. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన అరవింద్ మెడిసిన్‌లో ప్రతిభ కనబర్చి ఎంబిబిఎస్ సీటు సంపాదించడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజ్‌లో అరవింద్‌కు ఉచితంగా సీటు కల్పించారు. తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు బమ్ము చేయనని అరవింద్ తెలిపాడు. గిరిజన పేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఒర్చుకుని మెడిసిన్‌లో సీటు సంపాదించిన అరవింద్‌ను గ్రామస్తులు, తండా వాసులు అభినందించారు.

Comments

comments