గిరిజన పసికందు మృతి

గిరిజన పసికందు మృతి  పెంటావాక్సిన్ వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ మన తెలంగాణ/సిర్పూర్(యు): సిర్పూర్(యు) మండలంలోని నెట్నూర్ పరిధిలోని పాములవాడ గ్రామంలో రెండున్నర నెలల వయస్సుగల గిరిజన పసికందు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. శనివారం ఆ పసికందుకు వ్యాధినిరోధక టీకాలు అందించగా అంతలోనే  రాత్రి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్రం సోనేరావు, ప్రేమలత తమ రెండున్నర నెలల బాబుకు పెంటావ్యాక్సిన్ అందించేందుకు సిర్పూర్(యు) ప్ర భుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం తీసుకురాగా డాక్టర్ ప ర్యవేక్షణలో […]

గిరిజన పసికందు మృతి  పెంటావాక్సిన్ వల్లేనని తల్లిదండ్రుల ఆరోపణ

మన తెలంగాణ/సిర్పూర్(యు): సిర్పూర్(యు) మండలంలోని నెట్నూర్ పరిధిలోని పాములవాడ గ్రామంలో రెండున్నర నెలల వయస్సుగల గిరిజన పసికందు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. శనివారం ఆ పసికందుకు వ్యాధినిరోధక టీకాలు అందించగా అంతలోనే  రాత్రి మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆత్రం సోనేరావు, ప్రేమలత తమ రెండున్నర నెలల బాబుకు పెంటావ్యాక్సిన్ అందించేందుకు సిర్పూర్(యు) ప్ర భుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శనివారం తీసుకురాగా డాక్టర్ ప ర్యవేక్షణలో సిబ్బంది వ్యాధినిరోధక టీకాను ఇచ్చారు. అంతలో నే తెల్లవారు జామున పసిపా ప ఉలుకుపలుకు లేకుండా పోయింది. పెంటావ్యాక్సిన్ వికటించడంవల్లే తమ చిన్నారి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఈవిషయమై స్థానిక వైద్యాధికారిణి డా.హర్షిణిప్రియను వివరణ కోరగా పాములవాడకు చెందిన పసికందుకు పెంటావ్యాక్సిన్ అందించడం జరిగిందని, పిల్లల్లో వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తగా ఐదు రకాల వ్యాధులను నిరోధించడం కోసమే ఈ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. అదే రోజు మరో నలుగురు పిల్లలకు కూడా ఇచ్చామన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల పిల్లల్లో ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం లేదని వివరణ ఇచ్చారు.

Related Stories: