గిడుగు ముందడుగు తెలుగుకు కొత్త వెలుగు

అమ్మ ఒడిలో బిడ్డ మొదట పలికే పదం అమ్మ. ఆ మాటతోపాటు ఎన్నో పదాలను నేర్చుకుని తియ్యగా పలికే భాష తెలుగు. అమ్మభాష అంటే మన తెలుగు భాష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని భాషలు నేర్చుకున్నా మన అమ్మ భాషను ఎవరూ మరిచిపోలేరు. క్రీస్తు పూర్వం అయిదో శతాబ్ది నాటికే తెలుగు వాడుకలో ఉండేదని పురాతన శాసనాలు రుజువు చేస్తున్నాయి. ఛందస్సు, వ్యాకరణం సాహిత్యంతో దాదాపు కొన్ని శతాబ్దాలుగా గ్రాంధికంగా సాగిన భాష ఇతిహాసాలు, ప్రబంధాల […]

అమ్మ ఒడిలో బిడ్డ మొదట పలికే పదం అమ్మ. ఆ మాటతోపాటు ఎన్నో పదాలను నేర్చుకుని తియ్యగా పలికే భాష తెలుగు. అమ్మభాష అంటే మన తెలుగు భాష. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని భాషలు నేర్చుకున్నా మన అమ్మ భాషను ఎవరూ మరిచిపోలేరు. క్రీస్తు పూర్వం అయిదో శతాబ్ది నాటికే తెలుగు వాడుకలో ఉండేదని పురాతన శాసనాలు రుజువు చేస్తున్నాయి. ఛందస్సు, వ్యాకరణం సాహిత్యంతో దాదాపు కొన్ని శతాబ్దాలుగా గ్రాంధికంగా సాగిన భాష ఇతిహాసాలు, ప్రబంధాల రచనలతో ఎన్నో మలుపులు సొంపులు చేకూర్చుకుంది. అయితే పండితులపరంగా గ్రాంధిక పదాలే ఎక్కువగా చోటు చేసుకోవ డంతో నిరక్షరాస్యులకు సామాన్యులకు ఆ పదాల అర్థాలు ఒకంతట తెలిసేవికావు. ప్రజలు నిజజీవితంలో మాట్లాడే వ్యావహారిక భాషకు, కవితా సాహిత్యంలో వినిపించే భాషకు పొంతన ఉండేదికాదు. అటువంటి గ్రాంధిక దిగ్బంధం నుంచి విముక్తి కలిగించడానికి వ్యావ హారిక భాషా ఉద్యమం సాగించిన వారిలో మొదటి అడుగువేసింది గిడుగురామమూర్తి పంతులే. గిడుగు కృషివల్లనే తెలుగు సాహిత్యంలో వాడుక భాషకు ప్రాధా న్యం పెరిగింది. ప్రాచీన కావ్యాల ప్రభావం నుంచి బయటపడి తెలుగు కవిత్వం ఆధునిక సొబగులతో ముందుకుపోడానికి వ్యావహా రిక భాషే కొత్త ఊపిరిని అందించింది. ఆ మహనీయుడు గిడుగు రామమూర్తి సాగించిన ఉద్యమం తెలుగు సాహిత్యంలో అభ్యుద యాన్ని నవీనయుగాన్ని సృష్టించింది.
అందుకే గిడుగు జయంతి అయిన ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుభాషా దినోత్స వాన్ని జరుపుకొంటోంది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా పర్వతాల పేటలో 1863 ఆగస్టు29న వీర్రాజు,వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. గిడుగురామమూర్తి పంతులూ, గురజాడ అప్పారావు వీరిద్దరూ చిన్ననాటినుంచి సహధ్యాయులే. ప్రాచీన తెలుగు కావ్యాలను బాగా అధ్యయనం చేసిన గిడుగు గ్రాంధిక భాషాద్వేషి కాదు. ఏరచనయినా,ఏ కావ్యమయినా పండితులకే పరి మితం కాకుండా ప్రజల వాడుకలో ఉంటేనే భాషాపరంగా అందరికీ సులువుగా అర్థం అవుతుందని, ఎక్కువ మందికి ఆ రచనల సమా చారం అందుతుందని గిడుగు పూర్తిగా నమ్మేవారు. దీని వెనుక సామాజిక దృక్పథం ఉండేది.అయిన ఉద్యోగ రీత్యా సవరలు ఎక్కు వగా నివసించే పర్లాకిమిడిలో ఉండేవారు. అందుకే సవరల గురించి ముమ్మరంగా పరిశోధనలు సాగించారు. సవర భాషకు లిపిని రూ పొందించింది గిడుగురామమూర్తే. వాడుక భాషా ఉద్యమానికి అంకి తమైన గిడుగు గ్రాంధిక వాదులైన జయంతి రామయ్య పంతులు, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి,వేదం వెంకటరాయి శాస్త్రి, శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి వంటి కవిపండిత ప్రకాండులతో వాదానికి తరచుగా దిగవలసి వచ్చేది. గిడుగు ఆశయాలకు గురజాడ సంస్కరణ భావా లు అండగా ఉండేవి.
1911లో ప్రారంభమ యిన ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక వా దానికే మద్దతు ఇచ్చే ది. అయినా గిడుగు వెనుకడుగు వేయకుం డా తన తెలుగు పత్రిక ద్వారా వ్యావహారిక వా దాన్ని ఆయుధంగా చేసుకుని గ్రాంధిక వా దాన్ని ఖండించేవారు. వ్యాసావళి, బాలకవి శరణ్యం, పండిత భిష క్కుల భాషాభేషజం, సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శనం మొదలైన గ్రంధాలు రచించి కవి పండితులకు దీటుగా నిలబడ్డారు. అదే సమయంలో కొన్ని పత్రికలు, గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం తెలుగు వ్యావహారిక భాషకే పట్టం గట్టి ప్రజా బహుళ్యాన్ని ఆకట్టుకోగలిగాయి. శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి సారధ్యంలోని ప్రబుద్ధాంధ్ర పత్రిక, నవ్యసాహిత్య పరిషత్తు వారి ’ప్రతిభ పత్రికలు గిడుగుభాషా ఉద్యమానికి దన్నుగా నిలిచా యి. కొండకోనల్లో అనాగరికంగా జీవించే సవరుల కోసమే సవర భాషలో వ్యాకరణం రచించి చరిత్ర సృష్టించారు. సవరలకు చేరువగా వారితో మమేకమై వారి జీవితాల్లోని వాస్తవాలను లోకానికి తెలియచేయాలన్న ఆసక్తితో ఆయన సవర భాషను నేర్చుకున్నారు.
పుట్టి పెరిగింది సనాతన బ్రాహ్మణ కుటుంబంలోనే అయినప్పటికీ కుల మతాలను పట్టించుకోకుండా వారికి దగ్గరై పరిశో ధన సాగించారు. హరిజనోద్ధరణ ఉద్యమం పుట్టకముందే అంటే 120 సంవత్సరాల ముందే 1894లో గిరిజనులు కూడా అంటరాని వారిగా భావించే సవరలను అంటే శబరులను తన ఇంటిదగ్గరే పెట్టుకుని సవర భాష నేర్చుకోవడం ఆనాడు ఒక సాహసమే. కులాల కట్టుబాట్లు దృఢంగా ఉండే ఆ రోజుల్లో రామమూర్తి చర్యలు సాటి బ్రాహ్మణ వర్గానికి గిట్టేవికావు. సమాజంలో బాగా అట్టడుగున అనాగరికంగా బతికే వారికి అర్థమయిన భాషలో విజ్ఞాన బోధ చేయడమే గిడుగు వ్యావ హారిక భాషా వాదంలోని పరమార్థంగా భావించేవారు. ఎ మెమోరాండం ఆన్ మోడర్న్ తెలుగు (1913)లో ఈ లక్ష్యం కనిపిస్తుంది. గురజాడ మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించిన డిసెంటు పత్రం (అసమ్మతి పత్రం)లో ఉన్న వాదనే గిడుగు వాదనలోనూ కనిపిస్తుందని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు. కవిత్రయం రచించిన మహాభారతాన్ని ఎంతగా ఇష్టపడేవారో ఈ సఫ్ కథలనూ అంతే ఇష్టం ఉండేది. అందుకే ఈసఫ్ కథలను సవర భాషలోకి అనువదించారు. 1919లో ‘తెలుగు’ పేరుతో పత్రికను స్థాపించారు.
గ్రాంధిక వాదుల విమర్శలకు దీటుగా ఈ పత్రిక ద్వారా తన వాదాన్ని విని పించేవారు. రచన సాహిత్యం వ్యావహరిక భాషలో ఉంటేనే పాఠకు లకు ప్రయోజనం కలుగుతుందన్న సంకల్పంతో ‘నిజమైన సంప్రదాయం’ పేరుతో చిన్న పుస్తకం రాశారు. సాహిత్యం ద్వారా భాషా వ్యాప్తి కలుగుతుందనే ఆశయంతో 1932లో ‘అప్పకవీయ విమర్శనం’ తాళపత్ర కావ్యాలను పూర్తిగా పరిశీలించి గ్రంథరచన చేశారు. అలాగే పరవస్తు చిన్నయ సూరి ‘నీతిచంద్రిక’ రెండవ ముద్రణను ప్రచురించారు.శాసనాల ఆధారంగా, కావ్యాల ఆధారంగా ముఖలింగ క్షేత్రం కాశీ వంటిదని వెల్లడించారు.ఈ క్షేత్రాన్ని పూర్వం ’జయంతి పురం అని పిలిచేవారని నిరూపించారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సవిూపాన గల కొంకుదురు గ్రామంలో 1887లో దొరికిన శాసనాన్ని పరిశీలించి అందులోని అంశాలు అమలాపురం దగ్గర్లోని వెదిరేశ్వరం,పలివెల,ముమ్మిడివరం గ్రామాలకు సంబంధిం చినవని నిర్ధారించగలిగారు. వ్యావహారిక భాషా ఉద్యమనేతగా ఎంత పేరు గడించారో సవరలపై సాగించిన పరిశోధనల్లోనూ ఆయనకు అంతే ఖ్యాతి వచ్చింది. సవరల సంస్కృతిని పరిరక్షించడానికి అహర్నిశలూ కృషి చేశారు. సవరలకు సంబంధించి ఐతరేయ బ్రాహ్మణం నుండి అనేక కావ్యాల నుంచి ఎన్నో విశేషాలను వెలుగులోకి తె చ్చారు. రామాయణంలో శబరి, ఈ సవరలకు సంబంధించిందే అని మహాభారతం శాంతిపర్వంలో వీరి ప్రస్తావన ఉందని, విశ్వామిత్రుని శాపం పొందిన వారిలో సవరలున్నారని, భారతం, హరివంశం తదితర కావ్యాల్లో వీరి ప్రస్తావన ఉందని తెలుసుకుని పాఠకులకు వెల్లడించారు. వేటలో ప్రవీణులైన సవరలు స్వతంత్ర జీవనం కొన సాగిస్తూ విశాఖజిల్లా,ఒడిశా, బెంగాల్, సంబల్‌పూర్, తదితర ప్రాం తాల్లో ఉండేవారని పేర్కొన్నారు. సవర సంస్కృతిని వెలుగులోకి తేవడం వల్లనే ప్రభుత్వం వారిని గిరిజనులుగా గుర్తించింది. గిడుగు వ్యావహరిక భాషా ఉద్యమ వ్యాప్తికి చేసిన కృషి ఆయన జీవించిన కాలంలోనే సంపూర్ణంగా విజయవంతం కాలేదు. గిడుగు దీనికి ఆవేదన పడేవారు. కానీ తరువాత కాలంలో ఈ ఉద్యమం సత్ఫ లితాలను అందించింది. పరీక్షల్లో వ్యావహారిక భాషలోనే రాయడం అమలయింది. రచనలు వ్యావహారిక భాషలోనేరావడం ప్రారంభమ యింది. అంతవరకూ గ్రాంధిక భాషలోనే సంపాదకీయాలు రచించే పత్రికలు తమ పంథామార్చుకొన్నాయి. ’గిడుగు రామమూర్తి వ్యావ హారిక భాషావాదం లేవనెత్తడంతో తెలుగు కావ్యభాషా స్వరూపం మారిపోయింది అని శ్రీశ్రీ ప్రశంసించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతయినా సముచితం.

Comments

comments