గిట్టుబాటు కాని మద్దతు

Increased investments - chopped yields

పెరిగిన పెట్టుబడులు – తరిగిన దిగుబడులు
డీజిల్ ధర పెంపుతో అదనపు భారం
రసాయనిక ఎరువుల ధరలు పెంపు
మద్దతు ధర అమలు అంతంత మాత్రమే 

వ్యవసాయం కష్టాల కార్ఖానాగా తయారైంది. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం సాగు అంటేనే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 14 రకాల వ్యవసాయోత్ప త్తుల మద్దతు ధరలను పెంచింది. పెంచిన మద్దతు ధరలతో రైతుకు గిట్టుబాటయ్యే పరిస్థితి కన్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం అల్లం, బెల్లంలా ఉందని రైతాంగం ఆరోపిస్తుం ది. రసాయనిక ఎరువుల పెంపు, డీజిల్ ధర పెరుగుదల, ఇతర పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరను నిర్ణయించలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 

మన తెలంగాణ/ఖమ్మం :  కేంద్ర ప్రభుత్వం 14 రకాల వ్యవసాయోత్పత్తుల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పత్తిపై రూ.1130, ధాన్యం రూ200లు, జొన్నలపై రూ.640, కందులపై రూ.225, మినుములపై రూ.200 పెంచింది. ఈ మద్దతు ధరలు సరిగ్గా అమలు జరిగినా రైతుకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ఎందుకంటే గడచిన రెండు సంవత్సరాలలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా దుక్కి ఖర్చు దాదాపు రెట్టింపు అయ్యింది. డీజిల్ ధరలు, ట్రాక్టర్ విడి భాగాల ధరలు విపరీతంగా పెరగడంతో దుక్కి ధరలు పెరిగాయి. ఎకరాకు ఒక సాలుకు గతంలో రూ.600-800లు తీసుకోగా ఇప్పుడు రూ.1200-1400 తీసుకుంటున్నారు. డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యాజమానులది పెంచక తప్పని స్థితి. ఇక విత్తన ధరలు పెరిగాయి. ఈ సంవత్సరమే ప్రభుత్వం రసాయనిక ఎరువుల ధరలను పెంచింది. డిఏపిపై రూ.130, యూరియాపై రూ.36, కాంప్లెక్స్ ఎరువులపై రూ.106, పోటా షియం పై రూ.70 పెంచారు. దీనికి తోడు వ్యవ సాయ కూలీ పెరి గింది. మూడు సంవ త్సరాల క్రితంతో పోలిస్తే కూలీ దాదాపు రెట్టింపు అయ్యింది. వ్యవసాయ రంగంలో యాంత్రీ క రణ పెరి గినా పెట్టుబడులు మాత్రం తగ్గ లేదు. ఇక దిగు బ డులు ఇటీ వల కాలంలో గణనీయంగా తగ్గాయి. ప్రతి కూల వాతా వ రణ పరి స్థితులు, దిగు బ డు లపై తీవ్ర ప్రభావం చూపు తు న్నాయి. అతి వృష్టి, అనా వృష్టి, అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు దిగు బ డు లను తగ్గి స్తు న్నాయి. ఉదా హర ణకు గతంలో పత్తి సగటు దిగుబడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక రాకు 10 క్వింటాళ్లు ఉండగా పోయిన సంవ త్సరం ఆరు క్వింటాళ్లకు పడి పో యింది. ఖరీఫ్ ధాన్యం దిగు బ డులు తగ్గి పోయాయి. మిగి లిన పంటల పరి స్థితి ఇందుకు భిన్నంగా లేదు. ప్రతి కూల వాతా వ రణ పరి స్థితుల కారణంగా తెగుళ్లు, క్రిమి కీ ట కాల ప్రభావం పెరి గింది. ఇందుకు అదనంగా క్రీమి సంహారక మందులను వినియోగించడంతో పెట్టు బడి అద న మ వు తుంది. పైన పేర్కొన్న అంశా లను కేంద్ర ప్రభుత్వం పరి గ ణ లోకి తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి, రైతు శ్రమ పరిగణలోకి తీసుకుంటే మద్దతు ధర పెరిగేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం మద్దతు ధర ప్రక టించి తమ పనిపూర్త యిం ద న ట్లుగా వ్యవ హ రి స్తుంది. పలు సంద ర్బాల్లో మద్దతు ధరకు వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. ఉదాహారణకు కందుల మద్దతు ధర రూ.5450 ఉండగా కనీసం రూ.4వే లకు కూడా కొనుగోలు చేయలేదు. మార్క్ ఫెడ్, ఇతర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర అంటూనే రక ర కాల కొర్రీలు పెడుతుండడంతో ప్రైవేటు వ్యాపా రు లకు విక్ర యిం చక తప్పని స్థితి.పలు సంద ర్బాల్లో మిగిలిన పంటల విష యం లోనూ ఇదే జరిగింది. మొత్తం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వ్యవసాయరంగానికి జీవం పోసే దిశగా లేవని రైతులు, రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నారు.